Bandi Sanjay on CM KCR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మళ్లీ తనదైన శైలీలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అవన్నీ ఎటువెళ్లాయంటూ బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణ వచ్చాక నీళ్లు ఫామ్‌హౌజ్‌కు, నిధులు సీఎం చంద్రశేఖర్ రావు అనుయాయులకు, నియామకాలు చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకే దక్కాయని సంజయ్ మండిపడ్డారు. తొలి, మలి దశ ఉద్యమానికి యువత ఊపిరిగా నిలిచారని బండి సంజయ్ పేర్కొన్నారు. యువకుందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూశారని తెలిపారు. అలాంటి యువత తెలంగాణ ఏర్పడి అనంతరం ఏడేళ్లుగా ఉద్యోగం లేక, ఉపాధి లేక అల్లాడుతున్నారని.. ప్రస్తుతం వారి వయస్సు కూడా దాటి పోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యోమంలో అసువులు బాసిన 1200 మంది విద్యార్థి, యువకులు ఆత్మబలిదానాలకు.. అనంతరం ఉద్యోగాల కోసం జరిగిన ఆత్మ బలిదానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ కల సాకారమై ఏడేళ్లవుతోందని.. లక్షలాది మంది యువతీ, యువకులు ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్ ఈ ట్విట్ చేశారు.
బండి సంజయ్ ట్విట్..
నీళ్ళు ఫామ్ హౌజ్ కు…
నిధులు కేసీఆర్ ఫ్యామిలీకి… pic.twitter.com/vGiC7NgEYE— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 1, 2021
Also Read: