Bandi Sanjay: టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసు.. నేడు బండిసంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

|

Apr 06, 2023 | 6:30 AM

టెన్త్ క్లాస్  పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బెయిల్ వస్తుందా?. లాయర్లు ఏవిధంగా కేసును ఎదుర్కోనున్నారు? తదితర విషయాలపై ఇవాళ క్లారిటీ రానుంది. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఉదయం 10:30 గంటలకు వరంగల్ కోర్టులో విచారణ జరుగుతుంది.

Bandi Sanjay: టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసు.. నేడు బండిసంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
Bandi Sanjay Arrest
Follow us on

టెన్త్ క్లాస్  పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బెయిల్ వస్తుందా?. లాయర్లు ఏవిధంగా కేసును ఎదుర్కోనున్నారు? తదితర విషయాలపై ఇవాళ క్లారిటీ రానుంది. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఉదయం 10:30 గంటలకు వరంగల్ కోర్టులో విచారణ జరుగుతుంది. బండి సంజయ్ తరపున అడ్వొకేట్ కరుణాసాగర్ వాదనలు వినిపించనున్నారు. రిమాండ్‌కి సంబంధించిన పూర్తి ఆర్డర్ వచ్చిన తర్వాత హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని చెప్పారు బండి సంజయ్ తరపు లాయర్ కరుణాసాగర్. మరోవైపు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన తీరు కరెక్ట్ కాదని చెప్పారు ఆయన బ్రదర్ బండి సంపత్. సంజయ్ హెల్త్ కండిషన్ తెలుసుకోకుండా ట్యాబ్లెట్స్ తీసుకోనియ్యకుండా ఇబ్బంది పెట్టారని.. అర్థరాత్రి అరెస్ట్ చేసి.. తెల్లవారెంతవరకు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదన్నారు బండి సంపత్. లాయర్ల ద్వారా రిక్వెస్ట్ చేసినా బండి సంజయ్ ని కలిసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంపత్.

కరీంనగర్ జైలు దగ్గర బండి సంజయ్ ను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు ఆయన కుటుంబ సభ్యులు. పర్మిషన్ లేక పోవడంతో వెనుతిరిగారు. లీగల్ గా ప్రోసిడై ఇవాళ మార్నింగ్ కలుస్తామని చెప్పారు బండి సంజయ్ సతీమణి అపర్ణ, కుమారుడు బగీరథ్. అర్ధరాత్రి బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో.. ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పకుండా దారుణంగా వ్యవహారించారని చెప్పారు బండి సంజయ్ కుటుంబ సభ్యులు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..