Alai Balai Celebrations: అలయ్ బలయ్ వేదికగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆయన వారసత్వాన్ని ఘనంగా అందిపుచ్చుకుంది. ఆదివారం జలవిహార్ లో విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన అలయ్ బలయ్ సక్సెస్ అయింది. భారత ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇంతటి అద్భుత కార్యక్రమం తర్వాత విజయలక్ష్మి నెక్స్ట్ స్టెప్ ఎంటీ..? దత్తన్న కూతురిగా ఇక రాజకీయాల్లో రాణించడమేనా.. ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఎప్పుడు దిగుతారు వంటి అనేక ప్రశ్నలకు బండారు విజయలక్ష్మి సమాధానం చెప్పారు.
తాను దత్తన్న వారసురాలిగా ఇప్పటికే బిజెపి పార్టీలో ఉన్నానని.. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై పార్టీదే తుది నిర్ణయమని చెప్పారు. అంతేకాదు తమ పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తనవైపు నుంచి సిద్ధమని పార్టీలోని పెద్దలకు సిగ్నల్ ఇచ్చారు. ఇక అలయ్ బలయ్ తన ఆధ్వర్యంలో నిర్వహించడం బాధ్యతగా ఫీలవుతున్నానని చెప్పారు విజయలక్ష్మి. ఇక ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రముఖులు వచ్చి పాల్గొనడం మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. నాన్నగారు తీసుకొచ్చిన అలాయ్ బలాయ్ సంప్రదాయాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తానని తెలిపారు. ఆయన వారసురాలిగా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమ, ఆప్యాయతల సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించానని తెలిపారు.
Also Read: రేపు గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్..