Telangana TDP President: తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు.. ఖరారు చేసిన అధినేత చంద్రబాబు

టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కిని నరసింహులును పేరు ఖరారు. ఎల్. రమణ టీఆర్ఎస్ చేరికతో ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని అధినేత చంద్రబాబు భర్తీ చేశారు.

Telangana TDP President: తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు.. ఖరారు చేసిన అధినేత చంద్రబాబు
Bakkani Narasimhulu As Telangana Tdp President

Updated on: Jul 19, 2021 | 12:40 PM

తెలంగాణ టీడీపీకి కొత్త బాస్‌ రానున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కిని నరసింహులును పేరును ఖరారు చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటివరకు టీటీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్. రమణ టీఆర్ఎస్ చేరికతో ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని భర్తీ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుల బక్కని నర్సింహులును నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు పేరిట అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. గతంలో ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గానూ పని చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు అధ్యక్షుడిగా, 1994 నుంచి 99 వరకు షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా నర్సింహులు పని చేశారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించి పలువురు కీలక నేతల పేర్లు పరిగణనంలోకి వచ్చినప్పటకీ.. నర్సింహులు వైపే అధినేత చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి ఆయన ఆసక్తి చూపలేదు. దీంతో బక్కని నర్సింహులుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.

మరోవైపు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను బక్కని నర్సింహులు మద్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బక్కనిని లోకేశ్ అభినందించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాల నిలబడి పోరాటం చేయాలని అన్నారు. కాగా, తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని నర్సింహులు అన్నారు.

Read Also… 

 Doctors Negligence: నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. కడుపులోనే గుడ్డ ముక్క ఉంచి కుట్లేసిన వైద్యులు.. స్కానింగ్‌లో బయటపడ్డ నిర్వాకం!

Narendra Modi: ప్రధాని నోట బాహుబలి మాట.. వ్యాక్సిన్ తీసుకుంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటారు: నరేంద్రమోదీ