అయ్యో పాపం.! చనిపోయిన శునకం.. పాలు తాగిన పిల్లలు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

‘ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యమన్న’ ఓ కవి మాటలు అక్షరసత్యాలు. సృష్టిలో ఏ ప్రాణికైనా అమ్మ తర్వాతే ఇంకేమైనా..! అలా తల్లిని కోల్పోయిన పసి కూనలు.. తన అమ్మ చనిపోయిందన్న విషయాన్ని పసిగట్టలేక ఆమె పాలు తాగుతూ కనిపించింది. ఒక హృదయ విదారక ఘటన ధర్మపురిలో రోడ్డుపై వెళ్లేవారిని కలిచివేసింది.

అయ్యో పాపం.! చనిపోయిన శునకం.. పాలు తాగిన పిల్లలు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
Baby Puppies

Edited By: Balaraju Goud

Updated on: Nov 02, 2025 | 12:08 PM

‘ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యమన్న’ ఓ కవి మాటలు అక్షరసత్యాలు. సృష్టిలో ఏ ప్రాణికైనా అమ్మ తర్వాతే ఇంకేమైనా..! అలా తల్లిని కోల్పోయిన పసి కూనలు.. తన అమ్మ చనిపోయిందన్న విషయాన్ని పసిగట్టలేక ఆమె పాలు తాగుతూ కనిపించింది. ఒక హృదయ విదారక ఘటన ధర్మపురిలో రోడ్డుపై వెళ్లేవారిని కలిచివేసింది.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టి ఓ తల్లి కుక్క మృత్యువాత పడింది. చిన్న చిన్న పిల్లలున్న ఆ తల్లి కుక్క పోయింది గానీ.. అభం శుభం ఎరుగని ఆ కూనల ఆకలి తీర్చేదెవరు..? అందుకే, ఎప్పటిలా వచ్చి తల్లి పాలు తాగుతూ కనిపించాయి. కానీ, పాలు రావడం లేదు. తల్లి చనిపోయిందన్న విషయాన్నీ ఆ చిన్ని మూగజీవాలు పసిగట్టలేకపోయాయి. అలా తాగుదామంటే పాలందక.. తల్లి చనిపోయిన విషయం తెలీక ఆ కుక్క మృతదేహం వద్దే పడిగాపులుకాశాయి.

ఈ దృశ్యాలు అందరిని కలచివేశాయి. స్థానికులు చలించి మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందిస్తే.. వారు ఆ తల్లి కుక్క కళేబరాన్ని తీసుకెళ్లారు. ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. మనిషైనా, కుక్కైనా, ఇంకే జీవైనా తల్లీ, బిడ్డల బంధం వెల కట్టలేనిది. స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన రూపమంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..