అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది. రెండో రోజు రామయ్య నగర వీధుల్లో విహరించనున్న వేళ.. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పలువురు హిందువులు, నేతలు , రామ భక్తులు దేశంలోని హిందూ ఆలయాలను పరిశుభ్రం చేస్తున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి కిషన్‌రెడ్డి కూడా ఆలయాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోని శ్రీ కనకదుర్గ శ్రీ నాగలక్ష్మి ఆలయాన్ని స్వయంగా శుభ్రం చేశారు కిషన్ రెడ్డి. అంతేకాదు రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ముందు దేశంలోని అన్ని దేవాలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేపట్టాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘రామజ్యోతి’ వెలిగించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నాను’ అని కిషన్ రెడ్డి చెప్పారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలనీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆయన స్వయంగా చీపురు పట్టుకుని నాసిక్ లోని కాల రామ మందిరాన్ని శుభ్రం చేశారు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛతా అభియాన్ ఊపందుకుంది.
రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుక వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాల్లో మంత్రులు ముందుకు తీసుకెళ్తున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి బుధవారం తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవిత గమనానికి కేంద్రం వేల సంవత్సరాలుగా పూజలను అందుకుంటున్న దేవాలయాలే అని గవర్నర్ చెప్పారు.
పూర్వకాలం ఒక దేవాలయాన్ని నిర్మించి దాని చుట్టూ గ్రామం నిర్మించబడి.. అభివృద్ధి చెందిందని.. అది మన జీవితమంతా గురుత్వాకర్షణ కేంద్రంగా ఉందనే భావన పూర్వం ఉండేదని చెప్పారు. అయితే మన దేశం సుదీర్ఘ కాలం వలసల పాలన వలన ఈ భావన బలహీనపడింది. నేడు దేశమంతా ‘రామమయ’మయమైంది. అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం, దానిని నిర్వహించడం ప్రజల బాధ్యత… ఇది వారి నిత్య ఆచార వ్యవహారాల్లో భాగం కావాలి” అని అన్నారు.
📍Sri Kanaka Durga Nagalakshmi Temple, Basheerbagh, Hyderabad.
Undertook cleaning of temple premises as part of #SwachhTeerth campaign as called on by Hon’ble PM Shri @narendramodi ji as we move towards the inaugural of the Bhavya Ram Mandir at Ayodhya.
Today, when the country… pic.twitter.com/ZSKOeL9u8x
— G Kishan Reddy (@kishanreddybjp) January 17, 2024
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కూడా బుధవారం ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వచ్ఛత అభియాన్ ప్రచారంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని నాసిక్‌లోని కాలారామ్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రధాని మోడీ స్వయంగా తుడిచి నేలను తుడుచుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
నాసిక్‌లో జరిగిన 27వ జాతీయ యువజనోత్సవంలో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేస్తూ అయోధ్యలోని రామ్ లల్లా ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ రోజున దేశవ్యాప్తంగా తీర్థ క్షేత్రాలను, దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ 22న రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..