AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో ఏం చేశాడంటే..?

వివాహేతర సంబంధం నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణ ఒక యువతి ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటక నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఓ కుటుంబంపైకి భర్త స్నేహితుడే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆసుపత్రిలో రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు చివరకు కన్నుమూసింది.

Hyderabad: తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో ఏం చేశాడంటే..?
Auto Driver Stabs Woman To Death
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 12, 2026 | 8:15 PM

Share

వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్‌లో ఓ మహిళపై కత్తితో కిరాతకంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో, పోలీసులు ఈ కేసును హత్య కేసుగా మార్చి విచారణ వేగవంతం చేశారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన దిలీప్ (28) బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. అతని భార్య అశ్విని (25), మరదలు అంజలి (23) కూడా వారితో పాటే నివసిస్తున్నారు. అంజలికి ఐదేళ్ల కుమారుడు ఉండ, ఆమె భర్త ఓ క్రిమినల్ కేసులో గత రెండేళ్లుగా జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో అంజలి భర్త స్నేహితుడైన బీదర్‌కు చెందిన ఆటో డ్రైవర్ అశ్విన్ (25) తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. ఆ పరిచయం కాస్తా అంజలి, అశ్విన్ మధ్య సన్నిహిత సంబంధానికి దారితీసింది.

ఇటీవల అశ్విన్‌ను మరో పెళ్లి చేసుకోవాలని అంజలి సూచించింది. కానీ ఆమెను వదులుకోవడానికి నిరాకరించిన అశ్విన్, తనతోనే కలిసి ఉండాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకుని వెంటపడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అక్టోబర్ 10న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని దిలీప్ ఇంటికి వచ్చిన అశ్విన్, తన వెంట తెచ్చుకున్న అరటిపండ్లు కోసే కత్తితో అంజలి పొత్తికడుపులో బలంగా పొడిచాడు. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన అశ్వినిపై కూడా దాడి చేయడంతో ఆమె కుడిచేతికి తీవ్ర గాయమైంది.

బాధితుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న అంజలి, అశ్వినిలను మోతీనగర్‌లోని రివైవ్ ఆసుపత్రికి తరలించారు. తొలుత హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన అంజలి సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు మృతి చెందింది. దీంతో పోలీసులు హత్య సెక్షన్ 103(1) BNSను చేర్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు.

Follow Us
తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో..
తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో..
20 ఏళ్ల రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయెచ్చు.. రూ.12 లక్షలు ఆదా..!
20 ఏళ్ల రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయెచ్చు.. రూ.12 లక్షలు ఆదా..!
ట్రిగ్గర్ రిజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే మతిపోతుంది
ట్రిగ్గర్ రిజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే మతిపోతుంది
జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఇలా
జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఇలా
పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాను అన్నాడు.. ఆయనే కాపాడారు.
పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాను అన్నాడు.. ఆయనే కాపాడారు.
బడ్జెట్‌లో Acerpura Nitro.. ఫీచర్లు ఇవే
బడ్జెట్‌లో Acerpura Nitro.. ఫీచర్లు ఇవే
చిప్‌సెట్, డిస్‌ప్లేలతో యాపిల్ ఐప్యాడ్‌ మిని8.. మార్పులివే
చిప్‌సెట్, డిస్‌ప్లేలతో యాపిల్ ఐప్యాడ్‌ మిని8.. మార్పులివే
దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే
దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే
యూజర్లకు Airtel అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్
యూజర్లకు Airtel అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్
బోట్‌ స్టోన్​ 510.. పోర్టబుల్‌ స్పీకర్​ ధర తెలుసా
బోట్‌ స్టోన్​ 510.. పోర్టబుల్‌ స్పీకర్​ ధర తెలుసా