
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ తగాదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఘర్షణ జరిగింది. చేరుపల్లి కోదండ రామారావు అనే వ్యక్తికి చెందిన భూమిని స్థానిక వీఆర్వో మరికొంతమంది గ్రామస్తులతో కలిసి కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో ఘర్షణలు చెలరేగాయి.
కోదండ రామారావు కుమారుడు చేరుపల్లి రామచంద్రమూర్తికే ఆ భూమి చెందుతుందని గ్రామస్తులు తీర్మానం చేశారు. అయితే.. ఆ భూమి మాదేనని 10 మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి.