Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి

|

May 29, 2022 | 9:49 PM

మంత్రి మల్ల రెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రెడ్ల సింహగర్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి
Malla Reddy
Follow us on

మంత్రి మల్ల రెడ్డి(Malla Reddy) కాన్వాయ్ పై దాడి జరిగింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రెడ్ల సింహగర్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.రెడ్ల సింహగర్జన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా కొందరు  ఆయనను అడ్డుకున్నారు. దాంతో ఆయన ప్రసంగం ముగించుకుని వెళ్లపోతున్న సమయంలో  ఆయన  కాన్వాయ్ పై కుర్చీలు, రాళ్లు విసిరారు. దీంతో రెడ్ల సింహగర్జన సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో పోలీసులు దాడి చేసిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.