
Atmasakshi survey: ఆరా సంస్థ సర్వే తెలంగాణ రాజకీయాల్లో రేపిన చిచ్చు ఇంకా చల్లారనే లేదు. తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వే మరింత ప్రకపంనలు రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్(TRS)కు 39శాతం ఓట్లతో 56 నుంచి 59 సీట్లు వస్తే.. కాంగ్రెస్(Telangana Congress) పార్టీకి 31శాతం ఓట్లతో 37 నుంచి 39 శాతం సీట్లు వస్తాయంటోంది. బీజేపీకి 21 శాతం ఓట్లు 17 లోపు సీట్లకు పరిమితం అవుతుందని సర్వే చెబుతున్న విషయం. మొత్తంగా ఆత్మసాక్షి సర్వే టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని సర్వే పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు, ఓట్లు కాస్త తగ్గినా విజయం మాత్రం ఆ పార్టీదేనని నివేదించింది. మరోవైపు మజ్లిస్ పార్టీకి 2.75 – 3.25శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.88 లక్షల శాంపిళ్లను తీసుకున్నామని, జూన్ 30 నాటికి సర్వేను పూర్తి చేశామని ‘ఆత్మసాక్షి’ సీఈవో మూర్తి స్పష్టం చేశారు. తమ సంస్థ గతంలో 18 రాష్ట్రాల్లో సర్వే చేస్తే రెండుచోట్ల మినహా మిగతా అన్నిచోట్ల సర్వేలు నిజమయ్యాయని తెలిపారు. సంక్షేమ పథకాలు, యాసంగి ధాన్యం కొనుగోలు, శాంతిభద్రతలు, ఉద్యోగ అవకాశాలు, ధరణి పోర్టల్, కేసీఆర్ పాలన తీరు తదితర అంశాలపై 40 ప్రశ్నలతో సర్వే నిర్వహించామన్నారు.
మొత్తానికి సర్వేలపై సర్వత్రా చర్చ ఇంకా జరుగుతోంది. పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఎవరికి వారే తమదే అధికారం అంటున్నాయి పార్టీలు. ఇంతకీ జనాభిప్రాయం ఒక్కో సర్వేలో ఒక్కోలా వస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..