Kondagattu: కొండగట్టుపై 108 అడుగుల అంజన్న విగ్రహం.. ఆలయ పునఃనిర్మాణంపై ఆర్కిటెక్చర్ చెప్పిన కీలక విషయాలు.
తెలంగాణలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవలయ పునఃనిర్మాణంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించిన విషయం తెలిసిందే. యాదగురి గుట్ట లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయికే...

తెలంగాణలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవలయ పునఃనిర్మాణంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించిన విషయం తెలిసిందే. యాదగురి గుట్ట లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయికే కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులను సైతం అప్పగించారు. ఇక తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆలయ పునఃనిర్మాణానికి ఏకంగా రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫిబ్రవరి 14వ తేదీజ కొండగట్టు పర్యటనకు వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే సీఎం పర్యటనకు ముందే ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కొండగట్టును సందర్శించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించే క్రమంలో ఆనందర్ స్థాయి ఆదివారం కొండగట్టు వెళ్లారు. ఈ సందర్భంగా ఆనంద్ సాయి అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. యాదాద్రి తరహాలో కొండగట్టు ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు వచ్చానని, యాదాద్రి తర్వాత కొండగట్టును ఎంచుకోవడం శుభసూచకమన్నారు. సీఎం కేసిఆర్ అవసరమున్న పనులను గుర్తించి నివేదించాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు.
ఇక భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేలా అర్చకులతో కలిసి మాస్టర్ ప్లాన్ పైన చర్చించామన్నారు. ఇక కొండగట్టులో 108 అడుగుల అంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం ఉన్నట్లు ఆనంద్ సాయి తెలిపారు. అన్ని వైపుల నుంచి విగ్రహం కనిపించేలా నిర్మాణం ఉంటుందని చెప్పుకొచ్చారు. మొదటి, రెండవ ప్రాకారాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం జరిగేలా చూస్తామన్న ఆనంద్ సాయి.. వాటర్, కరెంట్ వంటి అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..