GHMC: గ్రేటర్ పరిధిలో నేటితో ముగియనున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్ల దరఖాస్తు గడువు.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే..?

|

Feb 16, 2021 | 5:50 AM

Greater Hyderabad Municipal Corporation: గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో నూతన బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. దీంతో మంగళవారం భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశముందని..

GHMC: గ్రేటర్ పరిధిలో నేటితో ముగియనున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్ల దరఖాస్తు గడువు.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే..?
Follow us on

Greater Hyderabad Municipal Corporation: గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో నూతన బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. దీంతో మంగళవారం భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 55 బార్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 1,116 దరఖాస్తులు అందినట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే గ్రేటర్‌ పరిధిలో 37 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా గ్రేటర్‌ ఆబ్కారీ విభాగాలకు రూ.11 కోట్ల 60 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో దరఖాస్తు ద్వారా రూ.లక్ష చొప్పున 1,116 దరఖాస్తులకు ఇంతమేర ఆదాయం వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదిలాఉంటే.. మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలోని ఐదు బార్లకు 132 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. మంగళవారంతో సాయంత్రం 4 గంటలతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనుండడంతో గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై అధికారుల కసరత్తు.. దివ్యాంగులు, 80 ఏళ్లపైబడిన వృద్ధులు, కొవిడ్ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు

కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ముమ్మర కసరత్తు.. ముఖ్యనేతల భేటీతో సందడిగా మారిన లోటస్‌పాండ్‌