Watch Video: ఏంటి భయ్యా ఇది.. పెట్రోల్ కొడుతున్నారా..? లేక నీళ్లు పోస్తున్నారా.. ఈ బంకు బాగోతం చూశారా..!
అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. తరుచుగా చెకింగ్ లాంటివి చేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. కొన్ని బంకుల్లో రీడింగ్ లో పలు మార్పులు చేసి కస్టమర్లను మోసం చేస్తుంటే.. మరికొన్ని పెట్రోల్ బంకులు ఏమాత్రం క్వాలిటీ లేని పెట్రోల్ ను పోస్తూ కస్టమర్ల వాహనాలను గుల్ల చేస్తున్నాయి.

అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. తరుచుగా చెకింగ్ లాంటివి చేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. కొన్ని బంకుల్లో రీడింగ్ లో పలు మార్పులు చేసి కస్టమర్లను మోసం చేస్తుంటే.. మరికొన్ని పెట్రోల్ బంకులు ఏమాత్రం క్వాలిటీ లేని పెట్రోల్ ను పోస్తూ కస్టమర్ల వాహనాలను గుల్ల చేస్తున్నాయి. కల్తీ పెట్రోల్ కారణంగా ఎంతోమంది వాహనాలు పాడయ్యాయి కూడా. అయితే కస్టమర్లు ఫిర్యాదులు చేస్తూన్నా.. అక్కడక్కడ కల్తీ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా వరంగల్ జిల్లాలో ఓ పెట్రోల్ బంకు మోసానికి పాల్పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరంగల్ జిల్లాలోని దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మోసాలకు పాల్పడుతోంది. అయితే ఓ కస్టమర్ కు అనుమానం వచ్చి తనిఖీ చేయగా పెట్రోల్ కు బదులు నీళ్లు వచ్చాయి. దీంతో విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాకయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోను బయటపెట్టాడు. అయితే ఇంత మోసం జరుగుతుంటే సంబంధిత శాఖ ఏం చేస్తోంది? తెలిసిన కూడా స్పందించడం లేదా ? అంటూ కస్టమర్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.