TPCC: ఢిల్లీలో మళ్లీ తెరపైకి వచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి వ్యవహారం.. రెండు, మూడు రోజుల్లో క్లారిటీ..!

|

Jun 03, 2021 | 7:22 AM

Telangana Congress PCC Chief: ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సారథి వ్యవహారం మళ్లీ మొదలైంది. గత కొన్ని రోజులు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీలో చర్చ..

TPCC: ఢిల్లీలో మళ్లీ తెరపైకి వచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి వ్యవహారం.. రెండు, మూడు రోజుల్లో క్లారిటీ..!
Follow us on

Telangana Congress PCC Chief: ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సారథి వ్యవహారం మళ్లీ మొదలైంది. గత కొన్ని రోజులు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీలో చర్చ జరుగగా. తాజాగా ఈ వ్యవహారంలో మరిన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి. త్వరలో టీపీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనుండటంతో సంస్థాగత అంశాపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల నాయకుల మధ్య నెలకొన్న విబేధాల పరిష్కారానికి సీనియర్‌ నేతలను రంగంలోకి దింపింది. 2022లో శాసనసభ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గుజరాత్‌, గోవా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలపై కాంగ్రెస్‌ పెద్దలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న పీసీసీ అధ్యక్ష, కార్యవర్గాల భర్తీకి కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. తెలంగాణ పీసీసీ సారథ్యంపై గతంలోనే ఏఐసీసీ అభిప్రాయ సేకరణ జరిపిన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ముందు దీనిపై ప్రకటన చేయవద్దని మాజీ మంత్రి జానారెడ్డి కోరడంతో అప్పుడు వాయిదా పడింది. ప్రస్తుతం ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో పీసీసీ అధ్యక్షుడిని నియమించే సంకేతాలు వినిపిస్తున్నాయిన రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పీసీసీ అధ్యక్షుడి రేసులో ఎంంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరి చివరి నిమిషంలో ఎవరికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Kakani : ఆనందయ్య మందు కోసం దళారులను నమ్మి మోసపోకండని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి వినతి

CM KCR on Land Digital Survey: జూన్ 11 నుంచి తెలంగాణ‌లో భూమి డిజిట‌లైజేష‌న్.. సర్వే పూర్తి బాధ్యత ఏజెన్సీలదేః సీఎం కేసీఆర్