Telangana: హైవేపై దూసుకొస్తున్న SUV కారు.. డౌట్ వచ్చి ఆపిన పోలీసులు.. లోపల కనిపించినవి చూడగా

నిర్మల్ జిల్లా ముధోల్‌లో పశువుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు చేధించారు. నిర్మల్‌లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో మత్తు మందు ఇచ్చి గోవులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు

Telangana: హైవేపై దూసుకొస్తున్న SUV కారు.. డౌట్ వచ్చి ఆపిన పోలీసులు.. లోపల కనిపించినవి చూడగా
Telugu News

Edited By: Ravi Kiran

Updated on: Aug 14, 2025 | 1:21 PM

నిర్మల్ జిల్లా ముధోల్‌లో పశువుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు చేధించారు. నిర్మల్‌లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో మత్తు మందు ఇచ్చి గోవులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం ముధోల్‌లో పశువు కళేబరాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. భైంసా ఎ.ఎస్.పి అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తయారు చేసి నిందితుల కోసం గాలించినట్లు తెలిపారు. నాందేడ్‌కు చెందిన సయ్యద్ సోహెల్ అనే వ్యక్తి దాదాపు 40 మందితో ముఠాగా ఏర్పడి వాహనాలలో పశువుల అక్రమ రవాణాకి పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.

ముధోల్‌లో గోవులను చోరీ చేసేందుకు రాగా సీసీ కెమెరాల ఆధారంగా ఒకరిని పట్టుకొని రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్లోని అజ్మీర దర్గా వద్ద ఏడుగురు, బైంసాలో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డవారిలో సయ్యద్ సోహెల్, షేక్ జమీర్, షేక్ ముర్తుజా, మహమ్మద్ నజీర్, సయ్యద్ అక్రమ్, సయ్యద్ షోయబ్, సయ్యద్ ఫైజాన్, షేక్ ఉమర్, ఖలీద్‌లు ఉన్నారన్నారు. వీరి వద్ద నుంచి రెండు కార్లు, 8 సెల్ ఫోన్లు, 39,280 రూపాయల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు.