మళ్లీ రాజుకున్న పసుపు బోర్డు వ్యవహారం.. బీజేపీ తీరుపై రైతుల ఫైర్.. తమిళనాడు మేనిఫెస్టో పత్రాలు తగులబెట్టి నిరసన

|

Mar 26, 2021 | 11:33 AM

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు వివాదం మళ్లీ రాజుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని రైతులు ఆందోళన బాటపట్టారు.

మళ్లీ రాజుకున్న పసుపు బోర్డు వ్యవహారం.. బీజేపీ తీరుపై రైతుల ఫైర్.. తమిళనాడు మేనిఫెస్టో పత్రాలు తగులబెట్టి నిరసన
Telangana Farmers For Turmeric Board
Follow us on

Turmeric board: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు వివాదం మళ్లీ రాజుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని రైతులు ఆందోళన బాటపట్టారు. అర్మూర్‌ పట్టణ కేంద్రంలో తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టో ప్రతులను పసుపు రైతులు దహనం చేశారు. తమిళనాడులో పసుపు బోర్డు, 15 వేల మద్దతు ధర ప్రకటిస్తామని మేనిపెస్టోలో చేర్చడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, తమిళనాడులో ఎలా ఏర్పాటు చేస్తారని పసుపు రైతులు మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి, ఎంపీకి తగిన గుణపాఠం చెబుతామని పసుపు రైతులు తేల్చి చెప్పారు.

ఇదిలావుంటే, తమిళనాడు బీజేపీ మేనిఫెస్టోపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందించారు. నిజామాబాద్ పసుపు రైతులకు ఆశించిన స్థాయి కంటే కూడా కేంద్రం ఎక్కువే చేసిందన్నారు. పసుపు రైతుల కోసం స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్‌ బోర్డు కూడా ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచామని అర్వింద్ వెల్లడించారు. పసుపు రైతులకు మద్దతు ధరకు మించి రేటు ఇస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి ఏడాది బడ్జెట్‌ని పది కోట్ల రూపాయలకు పెంచమన్నారు. క్వాలిటీ పసుపు పదివేలకు పైగానే ధర పలుకుతుందన్నారు.

ఇదీ చదవండిః వామ్మో.! ఈ పురుగు బారిన పడ్డారో అంతే సంగతులు.!! పల్లెల్లో గుబులు పుట్టిస్తున్న వింత పురుగు..