AP Politics: ఎక్కడికైనా వస్తాం.. ఎప్పుడైనా మాట్లాడుతాం.. ఇదే ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఛాలెంజ్

|

Jun 30, 2023 | 5:40 PM

ఎన్నికలు రాగానే మళ్లీ కొత్త మేనిఫెస్టో.. కొత్త కొత్త హామీలు. కానీ ఈ సారి సీన్ పూర్తిగా మారిపోయింది. హామీల చుట్టూ మాటల మంటలు చెలరేగుతున్నాయి. నాలుగేళ్ల పాలనపై.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పీక్ స్టేజిలోకి వెళ్లింది రాజకీయం. ఇంతకీ ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? ప్రభుత్వం మాటల్లో వాస్తవమెంత?

AP Politics: ఎక్కడికైనా వస్తాం.. ఎప్పుడైనా మాట్లాడుతాం.. ఇదే ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఛాలెంజ్
Pawan Kalyan - Chandrababu - CM Jagan
Follow us on

ఎన్నికలకు ఏడాది వచ్చేసింది. పార్టీలన్నీ ఎవరి వ్యూహాలతో వాళ్లు స్పీడప్ పెంచారు. ఈ క్రమంలో లేటెస్ట్ వ్యూహంతో వచ్చింది టీడీపీ. మేనిఫెస్టోలో అంశాలన్నీ దాదాపుగా అమలు చేశాం. ఇచ్చిన హామీలను 97శాతం అమలు చేస్తున్నాం అంటూ వైసీపీ చెప్తోంది. దానికి కౌంటర్‌గా అదే మేనిఫెస్టోను టార్గెట్ చేసింది టీడీపీ. వైసీపీ చెప్తుంది పూర్తిగా అవాస్తం అంటూ.. వాస్తవపత్రం పేరుతో టీడీపీ ఒక బుక్ రిలీజ్ చేసింది. వైసీపీ ఇచ్చిన ప్రతిహామీని ప్రస్తావిస్తూ.. అందులో ఏ హామీ ఎంత వరకు అమలయ్యాయో చూడండి అంటూ ఆ బుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. వైసీపీ పూర్తిగా అబద్ధం చెప్తోందనీ.. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో కేవలం 10శాతమే నెరవేర్చిందన్నారు అచ్చెన్నాయుడు. దీనిపై చర్చించేందుకు వైసీపీ నేతలు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.

అచ్చెన్నాయుడి అలా సవాల్ చేశారో లేదో.. ఛాలెంజ్‌కి రెడీ అంటూ వైసీపీ నుంచి ప్రతిసవాల్ వచ్చింది. ఎక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. డేట్, టైమ్.. ఫిక్స్ చేయండంటూ సవాల్ చేశారు. కుప్పంలో అయినా సరే టెక్కలిలో అయినా సరే…. ఎక్కడైనా చర్చకు సిద్ధమంటున్నారు మంత్రి జోగి రమేష్. బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రచారం చేసుకుంటున్నారే తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఆరోపిస్తోంది జనసేన. నాలుగేళ్లుగా ప్రజలకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు మారినప్పుడే మేనిఫెస్టో అమలైనట్టు లెక్క. అది జరగనప్పుడు మేనిఫెస్టో అనేది డొల్ల కాగితమే అంటోంది సీపీఎం. ఇదీ ఏపీలో జరుగుతున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు పర్వం. మేనిఫెస్టో చుట్టూ ఇప్పుడు మాటల యుద్ధం మొదలైంది. మరి సవాల్‌కు కట్టుబడి ఉండేది ఎవరు? చర్చకు వచ్చేది ఎవరు? లెట్స్ వెయిట్ అండ్ సీ…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..