Anchor Shyamala: షర్మిల కొత్త రాజకీయ పార్టీలో అప్పుడే చేరికలు మొదలయ్యాయా.? కండువా కప్పుకోనున్న యాంకర్‌ శ్యామల..?

Anchor Shyamala Joins In Sharmila Party: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమంటూ ప్రకటించిన షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటాస్‌ పాండ్‌లో మీటింగ్‌ ఏర్పాటు చేసిన షర్మిల..

Anchor Shyamala: షర్మిల కొత్త రాజకీయ పార్టీలో అప్పుడే చేరికలు మొదలయ్యాయా.? కండువా కప్పుకోనున్న యాంకర్‌ శ్యామల..?

Edited By: Ram Naramaneni

Updated on: Feb 11, 2021 | 10:00 PM

Anchor Shyamala Joins In Sharmila Party: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమంటూ ప్రకటించిన షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటాస్‌ పాండ్‌లో మీటింగ్‌ ఏర్పాటు చేసిన షర్మిల.. తన భవిష్యత్తుల కార్యచరణ ఏంటో స్పష్టంగా తెలియజేశారు. ఇక ఈ నెల 21 ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో కీల భేటీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే షర్మిల పెట్టబోయే ఈ పార్టీలోకి అప్పుడే చేరికలు మొదలయ్యాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అందులోనూ షర్మిల పార్టీకి గ్లామర్‌ టచ్‌ యాడ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా యాంకర్‌ శ్యామల.. తన భర్త నర్సింహారెడ్డితో కలిసి, షర్మిల భర్త బ్రదర్‌ అనీల్‌ను కలవడం చర్చకు దారి తీసింది. అయితే బుధవారం బ్రదర్‌ అనిల్‌ పుట్టిన రోజు కావడంతోనే తాను కలిసినట్లు తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్‌ చేస్తూ.. ఫ్రెండ్లీ మీటింగ్‌ అని క్యాప్షన్‌ జోడించింది అయితే ఇది పక్కా పొలిటికల్‌ మీటింగ్‌ అంటూ చర్చ జరుగుతోంది. శ్యామల త్వరలోనే షర్మిల పార్టీలో చేరబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత ఎన్నికల సమయంలో శ్యామల భర్తతో కలిసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రదర్‌ అనిల్‌ను కలవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి శ్యామల పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తుందా..? తాను చెప్పినట్లు అది నిజంగానే ఫ్రెండ్లీ మీటింగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: తెలంగాణలోని ఆ ప్రాంతంలో ఖర్జూర కల్లుకు విపరీతమైన డిమాండ్.. లీటరు రూ. 200పైనే.. ఆ గీత కార్మికుడి ఐడియా అదుర్స్