Telangana: ప్రాణం తీసిన యూట్యూబ్‌.. రీల్స్‌ను ఇమిటేట్‌ చేయబోయి 11 ఏళ్ల కుర్రాడు.

| Edited By: Narender Vaitla

Jul 23, 2023 | 8:28 PM

యూట్యూబ్ వీడియో అనుకరణ.. ఓ బాలుడి నిండు ప్రాణం తీసింది.. యూట్యూబ్ లో ఉన్న రీల్స్ చూస్తూ.. ఓ బాలుడు ఉరి వేసుకున్న ఘటన విషాదం రేపింది. లుంగీ మెడకు చుట్టుకోవడంతో.. ఊపిరి ఆడలేదు. తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..

Telangana: ప్రాణం తీసిన యూట్యూబ్‌.. రీల్స్‌ను ఇమిటేట్‌ చేయబోయి 11 ఏళ్ల కుర్రాడు.
Imitating Youtube
Follow us on

యూట్యూబ్ వీడియో అనుకరణ.. ఓ బాలుడి నిండు ప్రాణం తీసింది.. యూట్యూబ్ లో ఉన్న రీల్స్ చూస్తూ.. ఓ బాలుడు ఉరి వేసుకున్న ఘటన విషాదం రేపింది. లుంగీ మెడకు చుట్టుకోవడంతో.. ఊపిరి ఆడలేదు. తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండాకు చెందిన మాలోత్ ప్రశాంత్, వనిత దంపతులకు ఇద్దరు కుమారులు. ఆరో తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు ఉదయ్ (11) అనే కుర్రాడు యూట్యూబ్‌ వీడియోలను ఎక్కువగా చూసేవాడు.

ఇదే క్రమంలో శనివారం రాత్రి భోజనం చేశాక సెల్‌ఫోన్‌లో యూట్యూబట్ చూస్తూ ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అయితే ఎంతకీ గదిలో నుంచి రాకపోయే సరికి ఉదయ్‌ పేరెంట్స్‌ డోర్‌ తీయమని అడిగారు. లోపలి నుంచి సమాధాన రాకపోయే సరికి గడ్డ పారతో తలుపులు బద్దలు కొట్టారు. అయితే ఉదయ్‌ అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గోడకు ఉన్న మేకుకు లుంగీతో ఉరి బిగుసుకుని కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయ్‌ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు.

సెల్ ఫోన్‌లో ఎక్కువగా సన్నివేశాలను అనుకరించేందుకు ప్రయత్నించడమే ప్రాణాలు పోయేలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కొడుకు మరణాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కళ్ల ముందే కన్న కొడుకు చనిపోవడానికి తట్టుకోలేకపోయారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియని ఓ భిన్న విషాదాన్ని కళ్లకు కట్టింది. మరోవైపు మోబైల్ ఫోన్ వాడకం.. సోషల్ మీడియా ప్రభావం ఎంత వినోదం, విజ్ఞానాన్ని అందిస్తున్నాయో.. అదే స్థాయిలో తరచూ ఇలాంటి విషాదాలకూ కారణమవుతుండటం మరోసారి డిబేటేబుల్ ఇష్యూని తెరపైకి తెచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..