Bandi Sanjay: రూమర్స్ నమ్మొద్దు.. చౌటుప్పల్ సభ పై బండి సంజయ్ క్లారిటీ.. రాజగోపాల్ రెడ్డి చేరిక అప్పుడే..

|

Aug 13, 2022 | 11:20 AM

మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో ఈనెల 21వ తేదీన అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. మునుగోడులో

Bandi Sanjay: రూమర్స్ నమ్మొద్దు.. చౌటుప్పల్ సభ పై బండి సంజయ్ క్లారిటీ.. రాజగోపాల్ రెడ్డి చేరిక అప్పుడే..
Bandi Sanjay
Follow us on

Bandi Sanjay: మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో ఈనెల 21వ తేదీన అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. మునుగోడులో అమిత్ షా సభ వాయిదాపడిందని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. కొంతమంది కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షాకు కొన్ని తేదీలు సూచించామని.. 21వ తేదీన రావడానికి అమిత్ షా అంగీకరించారని బండి సంజయ్ తెలిపారు. అదేరోజు అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరతారన్నారు. టీఆర్ ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని.. బీజేపీవైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..