Amit Shah in Khammam highlights: కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయి.. ఈసారి అధికారం మనదే.. రైతు గోస-బీజేపీ భరోసా సభలో అమిత్ షా..

|

Aug 27, 2023 | 9:16 PM

Amit Shah Public Meet in Khammam highlights: ఈసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అంటున్నారు అమిత్‌షా. రాబోయే బీజేపీ సర్కారే, డౌటే లేదంటూ దీమాగా చెబుతున్నారు. ఖమ్మం సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించారు కేంద్ర మంత్రి అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేసీఆర్‌ పాలనకు నూకలు చెల్లాయని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌ సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం చేస్తున్నాయి. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్‌ విస్మరించారు. కేసీఆర్‌ కారు భద్రాచలం వెళ్తుంది కానీ ఆలయం వరకు వెళ్లదు. కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని విమర్శించారు.

Amit Shah in Khammam highlights: కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయి.. ఈసారి అధికారం మనదే..  రైతు గోస-బీజేపీ భరోసా సభలో అమిత్ షా..
Amit Shah

ఖమ్మం, ఆగస్టు 27: తెలంగాణలోని ఖమ్మంలో ‘రైతు గోస-బీజేపీ భరోసా’ ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ 4జీ పార్టీ అంటే నాలుగు తరాల పార్టీ (జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ), బీఆర్‌ఎస్ 2జీ పార్టీ అంటే రెండు తరాల పార్టీ (కేసీఆర్, తర్వాత కేటీఆర్) అని, ఒవైసీ పార్టీ 3G పార్టీ, ఇది 3 తరాల నుండి నడుస్తోందన్నారు.

రాష్ట్రంలో ఈసారి 2జీ, 3జీ, 4జీ ఏవీ రావని చెప్పారు. ఈసారి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఈసారి కమలం వంతు వచ్చిందన్నారు. ఒవైసీని కూర్చోబెట్టి తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రజల కలలను బద్దలు కొట్టే పనిని కేసీఆర్ చేశారని షా విమర్శించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ఇక సీఎం కాలేరని అన్నారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీని సీఎం చేయనున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.

కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్..

-అమిత్ షా.. కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి కాలేడు.. ఈసారి ఇక్కడ బీజేపీయే ముఖ్యమంత్రి అవుతుంది.

ఒవైసీ చేతిలో కేసీఆర్ కారు స్టీరింగ్ – హోంమంత్రి

ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘కేసీఆర్ పార్టీ ఎన్నికల గుర్తు కారు.. ఆ కారు భద్రాచలం వరకు వెళ్తుంది.. కానీ రామమందిరం దాకా వెళ్లదు ఎందుకంటే ఒవైసీ ఆ కారును స్టీరింగ్ చేస్తున్నారు. “చేతిలో ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Aug 2023 07:02 PM (IST)

    బస్సుయాత్రల రోడ్‌మ్యాప్‌

    రైతు గోస-బీజేపీ భరోసా సభ తర్వాత అమిత్‌షా, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాస్టార్‌ ప్లాన్‌ను నేతలకు వివరించారు. కీలకమైన నాయకులంతా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని సూచించారు. రాష్ట్రం మూడు వైపుల నుంచి బస్సుయాత్రల రోడ్‌మ్యాప్‌లపై చర్చించి దిశానిర్దేశం చేశారు అమిత్‌షా.

  • 27 Aug 2023 05:41 PM (IST)

    ఖమ్మంలోని బీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌షా భేటీ

    ఖమ్మంలోని బీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌షా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలపై నేతలకు షా దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోకి వచ్చేది బీజేపీ అని అన్నారు.

  • 27 Aug 2023 05:38 PM (IST)

    మోసపూరిత మాటలు ప్రజలు నమ్మవద్దు- బండి సంజయ్

    బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌.

  • 27 Aug 2023 05:30 PM (IST)

    ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే ప్రసక్తిలేదు.. -ఈటల రాజేందర్‌

    రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌..నాలుగున్నరేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు ఈటల రాజేందర్‌. ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే ప్రసక్తిలేకపోవడంతో, హైదరాబాద్‌లో భూములు అమ్మి రుణమాఫీకి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఈటల.

  • 27 Aug 2023 05:22 PM (IST)

    కాంగ్రెస్ పార్టీ 4జీ పార్టీ.. బీఆర్ఎస్ 2జీ పార్టీ.. – అమిత్ షా

    బీజేపీ నేతలపై దాడులు చేయిస్తే వాళ్లను నిలువరిస్తారని అనుకుంటున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కిషన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. కాంగ్రెస్ పార్టీ 4జీ పార్టీ.. అంటే నాలుగు తరాల పార్టీ. బీఆర్ఎస్ 2జీ పార్టీ.. రెండు తరాల పార్టీ అంటూ విమర్శించారు కేంద్ర మంత్రి అమిత్ షా.

  • 27 Aug 2023 05:22 PM (IST)

    పెద్దసంఖ్యలో తరలివచ్చిన అన్నదాతలు

    ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభకు అన్నదాతలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర హోంమత్రి అమిత్‌షా ఈ సభకు ముఖ్య అతిథిగా రావడంతో బీజేపీ స్థానిక నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర సీడ్‌ సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయడం లేదని కమలం నేతలు మండిపడ్డారు. రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సాగనంపాలని పిలుపునిచ్చారు అమిత్‌ షా.

  • 27 Aug 2023 05:15 PM (IST)

    బీఆర్ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోంది – అమిత్ షా

    తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది యువకులు అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేశరని గుర్తు చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోందని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేసీఆర్ గద్దె దిగిపోతారు. సంపూర్ణ మెజార్టీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందన్నారు అమిత్ షా.

  • 27 Aug 2023 05:11 PM (IST)

    భద్రాచలం వస్తారు.. రాముడిని దర్శించుకోరు.. కారణం ఇదే – అమిత్ షా

    భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందన్నారు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భద్రాచలం రాముడికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కేసీఆర్ విడిచిపెట్టారు. భద్రాచలం వస్తారు.. కాని రాముడిని దర్శించుకోరు… ఎందుకంటే ఆ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి అమిత్ షా.

  • 27 Aug 2023 05:08 PM (IST)

    కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. – అమిత్ షా

    తెలంగాణ ప్రజలను కేసీఆర్ వంచించారు. కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. తెలంగాణలో కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా.

  • 27 Aug 2023 05:06 PM (IST)

    కేసీఆర్ సర్కారును సాగనంపాలి.. బీజేపీకి మద్దతు ఇవ్వాలి.. – అమిత్ షా..

    హైదరాబాద్ విముక్తికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. హైదరాబాద్ 75 విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతోంది. సర్దార్ జమాలపురం కేశవరావుకు నా నమసులు. కేసీఆర్ సర్కారును సాగనంపాలి. కేసీఆర్ సర్కారును సాగనంపాలి.. బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.

  • 27 Aug 2023 04:49 PM (IST)

    నకిలీ విత్తనాగారంగా మార్చారు.. – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగగా మారిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు, పంటల బీమా అమలు చేయడం లేదన్నారు. వరి వేయొద్దని కేసీఆర్ ప్రభుత్వమే చెబుతోందన్నారు. తెలంగాణను విత్తనభాండాగారంగా చేస్తామని కేసీఆర్ చెప్పారని.. ఇప్పుడు నకిలీ విత్తనాగారంగా మార్చారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

  • 27 Aug 2023 04:43 PM (IST)

    ఆ రెండు పార్టీలు ఒకటే.. ఈ ఇద్దరికి ఓటు వేస్తే మజ్లీస్ పార్టీకి ఓటు వేసినట్లే..

    కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే. ఒకరు సోనియా కుటుంబం కోసం పనిచేస్తే.. మరొకరు కేసీఆర్ కుటుంబానికోసం పని చేస్తున్నట్లే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. బీఆర్ఎస్ పార్టీకి వేసినట్లే.. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే.. ఈ ఇద్దరికి ఓటు వేస్తే మజ్లీస్ పార్టీకి ఓటు వేసినట్లే అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

  • 27 Aug 2023 04:41 PM (IST)

    కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే దోస్తాన్- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే దోస్తాన్ ఉందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. చేవెళ్ల ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పచ్చి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. కేసీఆర్‌కు బీజేపీతో అంతర్గత స్నేహం కుదిరిందని.. అందుకే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేశారన్న ఖర్గే వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

  • 27 Aug 2023 03:43 PM (IST)

    అమిత్‌ షా తెలంగాణ షెడ్యూల్‌ ఇలా…

    • ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం 2.50లకు ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటారు.
    • గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.25 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు.
    • మధ్యాహ్నం 3.40 నిమిషాలకు ఖమ్మం ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్స్‌‌ ఏర్పాటు చేసిన బహిరంగసభకు చేరుకుంటారు.
    • సభ అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.
    • సాయంత్రం 5.50 నిమిషాలకు ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 6.20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయంకు తిరిగివెళ్తారు.
    • సాయంత్రం 6.25 గంటలకు తిరుగు ఢిల్లీకి ప్రయాణమవుతారు
  • 27 Aug 2023 03:38 PM (IST)

    ఖమ్మం బీజేపీ సభ లైవ్ కోసం ఇక్కడ చూడండి..

    మరో 20 నిమిషాల్లో సభకు చేరుకోనున్న కేంద్ర మంత్రి అమిత్ షా. అమిత్ షాకు ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు. ఖమ్మంలో మొత్తం 2 గంటలపాటు అమిత్‌షా టూర్‌ ఉండనుంది.  ఖమ్మం సభలో ప్రసంగానికి, నేతలతో భేటీకి 2గంటల సమయం కేటాయించారు. సభ అనంతరం టీబీజేపీ ముఖ్యనేతలతో షా కీలక భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా.

    ఖమ్మం బీజేపీ సభ లైవ్ ఇక్కడ చూడండి..

  • 27 Aug 2023 03:29 PM (IST)

    మరికాసేపట్లో ఖమ్మం బీజేపీ సభ..

    ఖమ్మం బీజేపీ సభ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సభకు తరలివస్తున్నారు. మరోవైపు, బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో కాషాయమయంగా మారింది ఖమ్మం పట్టణం. రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యుద్ధభేరి మోగించబోతున్నారు అమిత్‌షా.

  • 27 Aug 2023 03:27 PM (IST)

    అమిత్‌షా ప్రసంగంపై ఉత్కంఠ..

    అమిత్‌షా ప్రసంగంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం సభలో ఎలాంటి మాటల తూటాలు పేల్చబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. సరిగ్గా 4నెలలక్రితం చేవెళ్లకు వచ్చిన అమిత్‌షా.. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. మరి, ఖమ్మంలో కూడా అలాంటి సంచలన ప్రకటనలు ఏమైనా చేస్తారా? రైతుల కోసం ఎలాంటి పథకాలు ప్రకటిస్తారో అన్నది ఆసక్తి రేపుతోంది.

  • 27 Aug 2023 03:12 PM (IST)

    గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా..

    గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏపీ హోంమంత్రి తానేటి వనిత.. అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. ఖమ్మంలో మొత్తం రెండు గంటల పాటు సమయం కేటాయించనున్నారు అమిత్ షా. సభలో ప్రసంగం.. ఆ తర్వాత టీబీజేపీ నేతలతో భేటీకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా.

Follow us on