Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం.. పాదయాత్ర ఎందుకు ఆపేశారంటూ ఇంఛార్జి ఠాక్రేకు మహేశ్వర్‌ రెడ్డి లేఖ

|

Mar 14, 2023 | 9:04 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో దుమారం చెలరేగింది. పాదయాత్రలపై ముసలం రాజుకుంది. ఏకంగా ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేకు ఘాటు లేఖ రాసేవరకు వెళ్లింది పంచాయితీ.!

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం.. పాదయాత్ర ఎందుకు ఆపేశారంటూ ఇంఛార్జి ఠాక్రేకు మహేశ్వర్‌ రెడ్డి లేఖ
Maheshwar Reddy
Follow us on

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో దుమారం చెలరేగింది. పాదయాత్రలపై ముసలం రాజుకుంది. ఏకంగా ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేకు ఘాటు లేఖ రాసేవరకు వెళ్లింది పంచాయితీ.! ఇంతకీ మహేశ్వర్‌రెడ్డికి కోపం ఎందుకు వచ్చింది? ఆయన టార్గెట్‌ ఎవరో తెలుసుకుందాం రండి.తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పాదయాత్రల సీజన్‌ నడుస్తోంది. హైకమాండ్‌ అనుమతులతో ఎవరియాత్రలు వాళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి జనంలోకి వెళ్తున్నారు. ఈ నెల 16 నుంచి భట్టివిక్రమార్క యాత్ర మొదలవుతుంది. అయితే ఆదిలాబాద్ టు హైదరాబాద్‌ అంటూ AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన యాత్రకు మధ్యలోనే బ్రేక్ పడింది. ముథోల్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో 4 రోజులు మాత్రమే పాదయాత్ర సాగింది. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేకు ఘాటు లేఖ రాశారు మహేశ్వర్‌రెడ్డి. పాదయత్ర చేయమని చెప్పి, ఎందుకు వద్దన్నారు? ఈ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? ఏకపక్ష నిర్ణయాలు ఎంత వరకు కరెక్ట్ అంటూ పలు ప్రశ్నలు సంధించారు. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మహేశ్వర్‌రెడ్డి లేఖ రాసినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నది సుప్పష్టం.

ఇక మహేశ్వర్‌రెడ్డి యాత్ర ప్రారంభం రోజున… ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టివిక్రమార్క వంటి సీనియర్లు హాజరయ్యారు. సహజంగానే ఇది రేవంత్‌ వర్గానికి నచ్చలేదన్న చర్చ నడిచింది. ఇంతలోనే ఠాక్రే ఆదేశాలతో తన యాత్రను ఆపేశారు మహేశ్వర్‌రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ పాదయాత్రల్లోనూ వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరి వర్గం నేతలు వారితోనే నడుస్తున్నారు. ఇప్పుడు రేవంత్‌ టార్గెట్‌గా మహేశ్వర్‌రెడ్డి సంధించిన లేఖతో మరో లొల్లి రాజుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..