CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించింది. నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేసింది. పలు చోట్ల నిర్మాం కూడా పూర్తైనట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. దీనికి సంబంధించి సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.

CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..
Cm Revanth Reddy

Updated on: Aug 14, 2025 | 1:38 PM

కాంగ్రెస్ అధికారంలో వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ హామీమేరకు తొలుత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. లబ్దిదారులకు దారులకు విడుదల వారీగా రూ.5లక్షలు అందజేస్తోంది. అయితే నియోజకవర్గానికి 3500 ఇళ్లు మాత్రమే కేటాయించారు. దీంతో మిగిలినవారు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదరుచూస్తున్నారు. ప్రభుత్వం తమకు ఎప్పుడు కేటాయిస్తుందా అని పలు చోట్ల పేదలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఇందిర‌మ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. హైద‌రాబాద్‌లోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచ‌ర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని స‌మ‌స్యల‌ను కూడా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

తెలంగాణలోని అన్ని భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపుకు అవ‌స‌ర‌మైన ప్రణాళిక‌ల‌ను రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై సీఎం స‌మీక్ష నిర్వహించారు. రెవెన్యూ స‌ద‌స్సుల్లో వార‌స‌త్వ, ఇత‌ర మ్యుటేష‌న్లకు సంబంధించి స్వీక‌రించిన ద‌రఖాస్తుల‌ను త్వర‌గా ప‌రిష్కరించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. స‌ర్వేల విష‌యంలో, లైసెన్డ్ స‌ర్వేయ‌ర్లు పూర్తి చేసిన సర్వేలను రెగ్యుల‌ర్ స‌ర్వేయ‌ర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాల‌ని ఆదేశించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నిర్మించనున్న 10 కొత్త స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల న‌మూనాల‌ను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్‌, క్యాంటీన్‌, ఇత‌ర మౌలిక వసతులు ఉండాలని, ప్రజలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..