
Nagarjuna Sagar By Election 2021: తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై దృష్టిసారించాయి. ఎలాగైనా మళ్లీ నాగర్జున సాగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నిన్నటినుంచి ఇటు నాగర్జునసాగర్, ఏపీలోని తిరుపతి బైపోల్ కోసం నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీనిలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌కే ఈ సీటు కేటాయించాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. నోముల కుటుంబం వైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని నాయకులు పేర్కొంటున్నారు. అయితే టీఆర్ఎస్ రేపు అభ్యర్థిని ఫైనల్ చేసి వెంటనే నామినేషన్ వేయాలని చూస్తోంది.
ఈ మేరకు కేసీఆర్ కూడా నల్లగొండ, సాగర్ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నోముల భగత్‌కే టికెట్ కన్‌ఫాం అయినట్లు పార్టీ కేడర్ ప్రచారం చేస్తోంది. అయితే నోముల భగత్‌తోపాటు.. గురవయ్య, రంజిత్ పేర్లను కూడా టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలించిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నోములకు గుర్తింపుగా భగత్‌కే సీటు కేటాయిస్తే బాగుంటుందని.. పార్టీ ఆలోచిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
నోముల నర్సింహయ్య కన్నుమూసిన అనంతరం సాగర్ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఈ ఉపఎన్నికను నిర్వహిస్తున్నారు. మొదట ఇక్కడ యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని టీఆర్ఎస్ భావించింది. ఆ తరువాత నోముల కుమారుడితోపాటు పలువురు పేర్లనూ పార్టీ అధిష్టానం పరిశీలించింది. ఈ క్రమంలో భగత్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే కాంగ్రెస్ జానారెడ్డి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: