Hangover: లిక్కర్ హ్యాంగోవర్ దిగేదెలా? కొందరికి మందు తాగితే వాంతులు ఎందుకొస్తాయి?

|

Dec 30, 2024 | 6:30 PM

సరాదాక ఫ్రెండ్స్‌తో కలిసి వేసిన ఓ పెగ్.. తర్వాత మీ జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. అలా స్టార్ట్స్ చేసిన చాలామంది తర్వాత మద్యానికి బానిసలు అవుతారు. శరీరం పలు సిగ్నల్స్ పంపుతున్నా.. పట్టించుకోకుండా మద్యం తాగుతూనే ఉంటారు. అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో నాడులు దెబ్బతింటాయి. లివర్ తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది. శరీరంలోని ప్రతి భాగానికి వెళ్లే ఆల్కాహాల్.. బాడీ పార్టులను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

Hangover: లిక్కర్ హ్యాంగోవర్ దిగేదెలా? కొందరికి మందు తాగితే వాంతులు ఎందుకొస్తాయి?
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, మన శరీరం దానిని విషంగా గుర్తిస్తుంది. అందుకే ఇతర కార్యకలాపాల కంటే ఆల్కహాల్ ప్రాసెస్ చేయడానికి శరీరం కష్టపడుతుంది. ఇది ఒంట్లోకి ప్రవేశించిన వెంటనే జీవక్రియ అస్తవ్యస్తం అవుతుంది.
Follow us on

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. కానీ ఎంత చెప్పినా మాత్రం కొందరు దీన్ని వీడరు. జబ్బు బారిన పడినా కూడా లెక్కచేయరు. మద్యం వ్యసనానికి బానిసై సేవిస్తూనే ఉంటారు. అటు డబ్బు ఖర్చు అవుతుంది.. ఇటు ఆరోగ్యం గల్లంతు అవుతుంది. మద్యం సేవించినప్పుడు.. డోపమైన్, ఎండార్ఫిన్ రిలీజై.. తాత్కాలికంగా మీకు ఉత్తేజం కలుగుతుంది. అయితే కొన్నిసార్లు ముందు రోజు రాత్రి మద్యం తాగితే తెల్లారి హ్యాంగోవర్ బారిన పడుతుంటారు. తలనొప్పి, మైకం, నీరసం, బద్దకం వంటివి ఉంటాయి. దీనికి అర్థం మీ బాడీ సామర్థం కంటే మీరు ఎక్కువ ఆల్కాహాల్ తీసుకున్నారని. ప్రజంట్ అయితే..  హ్యాంగోవర్‌ను తప్పించుకోవడానికి ఎలాంటి మెడిసిన్స్ లేవు. లివర్.. గంటకు 8 నుంచి 12 గ్రాముల మధ్య ఆల్కహాల్‌ను బ్రేక్ చేస్తుంది. మీరు హ్యాంగోవర్‌‌లో ఉన్నారంటే.. మీ లివర్ ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ చేయలేదని అర్థం. మత్తు దిగేవరకు హైడ్రేటడ్‌గా ఉండటం తప్ప మీరు చేసేది ఏం లేదు. కాగా రెడ్ వైన్ ఎక్కువ హ్యాంగోవర్‌‌కు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వోడ్కా‌తో హ్యాంగోవర్‌‌ ప్రమాదం అంత ఉండదంటున్నారు.

వాంతులు ఎందుకు అవుతాయి….

కొంతమంది మద్యం సేవించిన తర్వాత వాంతులు చేసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ బాడీలోకి వెళ్లిన తర్వాత మొదటి దశ విచ్ఛిన్న ప్రక్రియలోఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఇదే వాంతులకు ప్రేరేపిస్తుంది. ఈ రసాయనం రిలీజైనప్పుడు కొందరిలో వాంతులు అవుతాయి. మీకు ఇలా వాంతులు అవుతున్నాయంటే.. ఆల్కాహాల్‌ను బయటకు పంపాలని.. మీ బ్రెయిన్ రెడ్ సిగ్నల్స్ ఇస్తుందని అర్థం. వాంతులు అవుతున్నా మీరు మద్యం తాగుతుంటే.. త్వరలో మీ బతుకు షెడ్డుకే. కాగా మనిషి కెపాసిటీ బట్టి లిక్కర్ తాగాక.. కొందరికి కిక్ త్వరగా ఎక్కుతుంది.. మరికొందరికి లేట్ అవుతుంది.

(గుర్తుపెట్టుకోండి.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..