Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్న మాణిక్యం ఠాగూర్.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

|

Jan 22, 2021 | 12:12 PM

Telangana Congress: వరుస పరాజయాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గట్టెక్కించాలని ఆ పార్టీ నేతలు సంకల్పించారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్న మాణిక్యం ఠాగూర్.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!
Follow us on

Telangana Congress: వరుస పరాజయాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గట్టెక్కించాలని ఆ పార్టీ నేతలు సంకల్పించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుదేలైన కాంగ్రెస్ పార్టీని.. త్వరలో జరగనున్న వరుస ఎన్నికల్లో విజయతీరానికి చేర్చి పట్టు నిలుపుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ నేత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్యే, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసిన వారి పేర్లను అధిష్టానానికి నివేదిస్తారని సమాచారం. అలాగే నాగర్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ నేపథ్యంలో నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో మాణిక్యం ఠాగూర్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. త్వరలోనే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నేతలతోనూ మాణిక్యం ఠాగూర్ భేటీ కానున్నారు.

Also read:

Elon Musk: భారీ నజరానా ప్రకటించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఇందుకోసం ఏం చేయాలంటే…

Pawan Kalyan: కాషాయ దుస్తుల్లో వకీల్ సాబ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న ఫొటోలు