Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ప్రకటించిన ఏఐసీసీ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు అధిష్టానం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తన పేరును ప్రకటించడంతో పార్టీ అధిస్తానంకు ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ప్రకటించిన ఏఐసీసీ
Naveen Yadav (1)

Updated on: Oct 08, 2025 | 10:42 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు అధిష్టానం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తన పేరును ప్రకటించడంతో పార్టీ అధిస్తానంకు ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసమే ఎన్నికల బరిలో బలమైన అభ్యర్ధిని దించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం నవీన్ యాదవ్‌ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌ పేరు ఖరారైంది. ఏఐసీసీ ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. నవంబరు 11న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. మరి ఈ సీటును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి. తమ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. గోపినాథ్ భార్య సునీతను బరిలోకి దింపింది. ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

అయితే అధికార పార్టీలో అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో బంతి అధిష్టానం గూటికి చేరింది. దీంతో అభ్యర్థి ఎంపికపై పూర్తిస్థాయి కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. సర్వే ఆధారంగా ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు ఇంచార్జ్ మంత్రులు. రాష్ట్ర నాయకత్వం నవీన్ యాదవ్, బొంతు రాంమోహన్, CN రెడ్డి పేర్లు అధిష్టానికి పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు తాను కూడా టికెట్ రేసులో ఉన్నానంటున్నారు అంజన్‌ కుమార్ యాదవ్‌. ఇక కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌కు అవకాశం లభించింది. నవీన్‌ యాదవ్‌ ఆ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి, తాజాగా టికెట్‌ దక్కించుకున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గల్లీ టు ఢిల్లీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార పార్టీ. ఎలాగైనా ఈ సీటును దక్కించుకోకపోతే.. ఆ ప్రభావం మున్ముందు కూడా ఉంటుందన్న అంచనాలతో గట్టిగా పాగా వేసింది కాంగ్రెస్. ముగ్గురు మంత్రులకు ఈ గెలుపు బాధ్యత అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…