Telangana: ఓ నెల ముందుకు.. వరి సాగుకు నయా ప్లాన్.. అగ్రికల్చర్ క్యాలెండర్‌లో మార్పులకు తెలంగాణ సర్కర్ కసరత్తు..

|

May 29, 2023 | 4:59 PM

సహజంగా ఎండాకాలం వరి పంట కోసం డిసెంబర్, జనవరిలో నాట్లు వేస్తారు రైతులు. ఏప్రిల్, మే నెలల్లో కోతకొస్తుంది. అలా కాకుండా ఇదే సమయంలో అకాలవర్షాలు ముంచుకురావడం వరి రైతును కుంగదీస్తోందన్నది ప్రభుత్వ వాదన. ఓ నెల ముందుకు జరిపితే ఈ నష్టం నివారించవచ్చని యోచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక నుంచి నవంబర్ నెలలోనే నాట్లు వేసేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

Telangana: ఓ నెల ముందుకు.. వరి సాగుకు నయా ప్లాన్.. అగ్రికల్చర్ క్యాలెండర్‌లో మార్పులకు తెలంగాణ సర్కర్ కసరత్తు..
Paddy Crop Cultivation
Follow us on

తెలంగాణాలో వరిపంటపై మళ్లీ కొలవెరి. అగ్రికల్చర్ క్యాలెండర్‌లో మార్పులు తప్పవంటున్న తెలంగాణ ప్రభుత్వం.. వరి పంటపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది. వరి పంటను ఒక నెల ముందుకు జరిపేందుకు కసరత్తు మొదలుపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇదే అంశంపై తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. గాలివానలు, అకాల వర్షాల నుంచి పంట నష్టాన్ని నివారించేందుకు అగ్రికల్చర్ కాలెండర్‌ను ముందుకు జరిపే దిశగా చర్చలు జరుగుతున్నాయి. సహజంగా ఎండాకాలం వరి పంట కోసం డిసెంబర్, జనవరిలో నాట్లు వేస్తారు రైతులు. ఏప్రిల్, మే నెలల్లో కోతకొస్తుంది. అలా కాకుండా ఇదే సమయంలో అకాలవర్షాలు ముంచుకురావడం వరి రైతును కుంగదీస్తోందన్నది ప్రభుత్వ వాదన. ఓ నెల ముందుకు జరిపితే ఈ నష్టం నివారించవచ్చని యోచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక నుంచి నవంబర్ నెలలోనే నాట్లు వేసేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

ఇదే అంశంపై గత వారం కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే వరి ముందస్తు సాగుపై చర్చించారు. నెల రోజుల ముందే వరి సాగు చేసేలా రాష్ట్రవ్యాపత్తంగా రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావంతో రైతాంగం నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. వానాకాలం పంట సన్నద్ధతతోపాటు, వానాకాలం, యాసంగి పంట కాలాలు కుదించేందుకు రెడీ అవుతోంది.

వరి పంటను నెల రోజుల ముందే సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం  కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాసంగి వరి నాట్లు నవంబర్ 15 నుంచి 20 వరకు సిద్ధం చేసుకునేలా చూడాలని .. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పంట కాల పరిమితి కుదింపుపై.. అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ముందస్తు వరి సాగుపై నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రతి మంగళవారం, శుక్రవారం రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో మనం వ్యవసాయ క్యాలెండర్‌లో మార్పులు తీసుకురావచ్చని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం