Telangana: పరీక్షలో ఫెయిలయ్యానని విద్యార్థిని సంచలన నిర్ణయం.. ఏం చేసిందంటే?
ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్థాపానికి గురైన 17 ఏళ్ల విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన కూతురిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో యువత, చిన్నారులకు చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రేమించిన వాళ్లు నిరాకరించారని, ఫరీక్షలో ఫెయిలయ్యామని అర్ధాంతరంగా జీవితాలను చేతులారా చిదిమేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ మండలానికి చెందిన 17 ఏళ్ల సౌజన్య స్థానికంగా ఉన్న ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. అయితే తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో సౌజన్య ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన సౌజన్యను చూసి షాక్ అయ్యారు.
వెంటనే బాలికను కిందకు దింపి ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ సౌజన్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అది విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
