
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆసక్తికర రాజకీయాలు తెర మీదకొస్తున్నాయి. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తుండంతో దేశం చూపంతా ఆదిలాబాద్‌పై పడింది. దీంతో రాష్ట్ర బీజేపీనేతల రాకతో ఆదిలాబాద్ కాషాయ సేన అలర్ట్ అయింది.
ఇదే సమయంలో ఎవ్వరు ఊహించని ఆసక్తికర ఘటనలు మీడియా కెమెరా ల ముందు తలుక్కుమంటూ మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అసలే తెలంగాణ రాష్ట్రంలోఆదిలాబాద్ ఎంపి సీటు హాట్ సీట్ గా మారడం.. బీజేపీలో పోటీ తీవ్రమవడంతో టికెట్ సంపాదించుకునేందుకు ఆశవాహులు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా కాషాయ అగ్రనేతలు పాత పగలను పక్కన పెట్టి అలాయ్ బలాయ్ లతో ఆత్మీయ పలకరింపులు చేసుకోవడం అందరిని ఆకట్టుకుంటోంది. మా మద్య వర్గ విభేదాలుఏం లేవు.. మేమంతా కలిసెడ ఉన్నాం అని చెప్పేందుకు ముప్పు తిప్పలే పడాల్సి వస్తోంది. అలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మోడీ పర్యటన ఏర్పాట్ల స్థలంలో చోటు చేసుకుంది.
అదిలాబాద్ జిల్లాలో ఈనెల 4 న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్ల పరిశీలనలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మోదీ సభ సన్నాహక సమావేశం ముగించుకుని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ సోయం బాపురావ్ వాహనంలో ముందు కూర్చొని ఉండగా డ్రైవర్ ను కిందకు దింపి మరీ.. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ డ్రైవింగ్ చేయబోయారు. మా మద్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని మేము కలిసే ఉన్నామని చెప్పేందుకు చేసే ప్రయత్నం కాస్త ఆసక్తిని రేపింది.
అదేలాగంటే మాజీ ఎంపీ ఉత్సాహంతో కారు నడపబోయి గేర్లు వేసే సమయంలో తికమకకు గురవడమే..! మాజీ ఎంపీ డ్రైవింగ్ చేయడంతో ముందుకూ వెళ్లాల్సిన బండి కాస్తా వెనక్కు వెళ్లడంతో హైరానా పడటం ఎంపీ సోయం బాపురావ్ వంతైంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కారును స్లో చేయగా.. దాదా నీకెందుకు బెంగ మైహూనా అంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్టీరింగ్ అందుకోవడంతో నవ్వుల పువ్వులు పూశాయి. రాథోడ్ డ్రైవింగ్ తో ఖంగారు పడ్డ క్యాడర్ సీనియర్ డ్రైవర్ పాయల్ డ్రైవింగ్ తో అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారంతా.. ఎంపీ సోయం , మాజీ ఎంపీ రాథోడ్ ను వాహనంలో కూర్చొబెట్టుకుని డ్రైవ్ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ మేమంతా కలిసే ఉన్నామని గట్టిగానే సమాదానం ఇచ్చారు కూడా. బయట నడుస్తున్న వర్గ విభేదాల టాక్ కి ఇలా డ్రైవింగ్ తో చెక్ పెట్టాడంట పాయల్.
అయితే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ డ్రైవింగ్ లో పర్పెక్టే అయినా.. లేటెస్ట్ టెక్నాలజీ ఫార్చునర్ వాహనం కావడంతో గేర్లు మార్చడంలో కాస్త తడబడ్డారంట. పైనల్ గా శంకర్ డ్రైవింగ్ లో అంతా సేప్ గా ప్రయాణించి ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించడం పార్టీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తెరలేపింది. గతంలో ఎంపీ సోయం బాపురావ్.. పాయల్ శంకర్.. రాథోడ్ రమేష్ లపై వివాదాస్పద వాఖ్యలు చేయగా, కుటుంబం అన్నాక గొడవలుండవా.. అన్నదమ్ములు అన్నాక అలకలుండావా అని చెప్పుకొచ్చారంట ఎంపీ సోయం బాపురావ్. టికెట్ పోటీ టికెట్ పోటే దోస్తానాదోస్తానే అంటూ క్యాడర్ లో జోష్ ను నింపారంట ఈ ముగ్గురు నేతలు. చూడాలి మరీ ఈ సరికొత్త స్నేహం ఏ మలుపులకు కారణమవనుందో.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకెత ఆసక్తిని రేపనుందో..!!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…