ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ లాడ్స్ నిధులను తన సొంత అవసరాల కోసం వినియోగించుకున్నానని కుండబద్దలుకొట్టారు. బీజేపీ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన ఆయన.. నిదుల వినియోగంపై ఓపెన్ అయిపోయారు. ‘ఎంపి నిధులను వాడుకుని ఇళ్లు కట్టుకున్నా. ఎంపీ ల్యాడ్స్ నిధులతోనే కుమారుడి పెళ్లి చేశాను. నిధులు వాడుకోవడం తప్పా? గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నిధుల గోల్‌మాల్‌కు పాల్పడలేదు. అభివృద్ధి కోసం మీకు నిధులు పంచకపోవడం వాస్తవమే. ఒక ఎంపీగా సొంత ఇళ్లు లేకపోతే గౌరవం ఉండదనే.. ఎంపీ నిధులను వినియోగించుకుని ఇల్లు నిర్మించుకున్నాను.’ అంటూ ఎంపీ సోయం బాపూరావు షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ ఏడాది ఎంపీ ల్యాడ్ నిధులు రావడంతో బీజేపీ ప్రజాప్రతినిధులకు కేటాయించడానికి ఆదిలాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీ సోయం. ఈ సమావేశంలో నిధులను సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నట్లు ఎంపీ వెల్లడించడంతో బీజేపీ నేతలు అవాక్కయ్యారు. మరి ఎంపీ వ్యాఖ్యలపై ప్రత్యర్థులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..