Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి భద్రత పెంపు.. నిఘా వర్గాల హెచ్చరికలతో అలర్ట్..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ భద్రతపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. బండికి మరింత భద్రత పెంచుతూ నిర్ణయం తీసున్నారు. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో సెక్యూరిటీ పెంచారు.

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి భద్రత పెంపు.. నిఘా వర్గాల హెచ్చరికలతో అలర్ట్..
Bandi Sanjay

Updated on: Jun 22, 2022 | 6:08 AM

Bandi Sanjay Security: భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు మరింత భద్రత పెంచారు. 1+5తో రోప్‌ పార్టీ ఏర్పాటు చేశారు అధికారులు. అదనంగా ఎస్కార్ట్‌ వాహనాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్‌కు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నివేదిక ఇవ్వడంతో, భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీ నేత‌లు, కార్యక‌ర్తల‌తో క‌లిసి దూకుడు ప్రదర్శిస్తున్నారు బండి సంజయ్. హిందుత్వ ఎజెండానే ల‌క్ష్యంగా, హిందువులంద‌రినీ ఏక‌తాటిపైకి తెచ్చేలా ప్రసంగాలు చేస్తున్నారు. కీలక పార్టీల నేత‌లే టార్గెట్‌గా ఆయన ప్రసంగాలు ఉండటంతో, కొన్ని వర్గాలు సంజయ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేసింది నిఘా విభాగం. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్‌లో హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా నిర్వహించిన ర్యాలీలోనూ బండి సంజ‌య్ సంచలన కామెంట్స్‌ చేశారు.

ఈ వ్యాఖ్యల తర్వాత, సంజ‌య్‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు గట్టిగా హెచ్చరించాయి. అటు, బీజేపీ కార్యకర్తలు కూడా బండి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విష‌యాన్ని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు సంజయ్. దీంతో బీజేపీ అధిష్టానం కూడా అల‌ర్ట్ అయింది. ప్రస్తుతం తెలంగాణలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలోనూ బండి భద్రతపై పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..