ACB Rides: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు మరిన్ని కష్టాలు..ఈ సారి ఏసీబీ ఎంట్రీ!

ACB Rides: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మరో ఫిర్యాదు వచ్చింది. ఈసారి రంగం హైదరాబాద్ నడిబొడ్డుకు చేరింది.

ACB Rides: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు మరిన్ని కష్టాలు..ఈ సారి ఏసీబీ ఎంట్రీ!
Acb Rides On Exibition Society

Updated on: Jul 02, 2021 | 5:41 PM

ACB Rides: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కొత్త కష్టం మొదలైంది. ఈసారి ఏసీబీ రంగంలోకి దిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ లో అక్రమాలు జరిగాయని ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈసారి సీన్ హైదరాబాద్ నడిబొడ్డుకు చేరింది. ఈ ఫిర్యాదులపై ఏసీబీ ఈరోజు తనిఖీలు మొదలు పెట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కి చైర్మన్ గా వ్యవహరించిన ఈటెల రాజేందర్ పై ఫిర్యాదులు రావడంతో సోద్దలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీలో నిధుల గోల్ మాల్ జరిగిందని ఫిర్యాదు. ఈ నిధుల లెక్కల తేడాలలో ఈటెల హస్తం ఉందంటూ వచ్చిన ఫిర్యాదుపై చర్యలు ప్రారంభించిన ఏసీబీ ఈరోజు సొసైటీ ఆఫీసులో సోదాలు చేస్తోంది.

అచ్చంపేట ప్రాంతంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమునా హాచరీస్ 60 ఎకరాలకు పైగా భూమి కబ్జా చేసినట్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని కబ్జా చేశారంటూ పలువురు రైతులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేఖలు కూడా రాశారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించగా.. భూకబ్జాను ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులను విచారణకు ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ చే నివేదిక తెప్పించుకున్నారు. భూ కబ్జా నిజమని అధికారులు తేల్చిన వెంటనే.. ఈటల రాజేందర్‌కు కేటాయించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖను తొలగించి ముఖ్యమంత్రి తీసేసుకున్నారు. అది జరిగిన కొన్ని గంటలు గడిచిన కాసేపటికే.. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం కూడా విదితమే. మంత్రిగా ఆయన బర్తరఫ్ కు గురైన నేపధ్యంలో హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి తన రాజీనామా సమర్పించారు. ఆయన 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. కాగా, భూముల ఆక్రమణల ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి‌తోపాటు టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన వెంటనే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

Also Read: Revanth Reddy: ‘అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి’.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్

CM KCR Siricilla Tour: ప్రతి ఊరు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే సంకల్పం.. ఈనెల 4న రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్