
అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీలతో మెదక్ కలెక్టరేట్లో శుక్రవారం కలకలం రేగింది. ఓ రైతు నుంచి సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గంగయ్య రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గూడెం గడ్డ లో మాడ మల్లేశం తన భూమిలో అవకతవకలు ఉన్నాయని మెదక్ జిల్లా ఇంచార్జి సర్వేయర్ గంగయ్య ను ఆశ్రయించాడు. సర్వే కోసం మే నెలలో 4వందల రూపాయలు చెల్లించిన అనంతరం సర్వే చేయమంటూ సంబంధిత అధికారిని కోరాడు. దీంతో జిల్లా సర్వేయర్ గంగయ్య లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు గత నాలుగు నెలల నుంచి అధికారి చుట్టూ తిరగగా లక్ష రూపాయల లంచం నుంచి చివరికి .80 వేల రూపాయలను ఇవ్వమని కోరాడు సర్వేయర్ గంగయ్య.
అంతేకాదు రూ. 80 వేలలో ముందుగా రూ. 30 వేలు చెల్లించాలని .. అప్పుడు సర్వే తనకు అనుకూలంగా ఇస్తానని హామీ ఇచ్చాడని మాడ మల్లేశం చెప్పాడు. దీంతో రైతు మల్లేష్ నవంబర్ 2 వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో మల్లేష్ ఒప్పంద ప్రకారం గంగయ్యకు ముందుగానే రూ. 30 వేలు చెల్లిస్తానని అతని వద్దకు అధికారులు పంపించాడు. గంగయ్య లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారుల సహా ఎస్ఐ వేంకట రాజగౌడ్, రమేష్ లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా సర్వేయర్ ను విచారించగా గతలో 2014లో నిజామాబాద్ లో ఏసీబీ దాడిలో పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా సర్వేయర్ ను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా అధికారులు లంచం అడిగితే 1064 కు కాల్ చేయాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..