Sub Registrar Taslima: అరెస్టైన నెలరోజులకు తస్లీమా ఇళ్లలో సోదాలు.. ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా?

| Edited By: Balaraju Goud

Apr 23, 2024 | 7:11 AM

మార్చి నెలలో ఓ ప్లాట్​ రిజిస్ట్రేషన్​ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్​ సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదైంది. తస్లీమా ఇంటితో పాటు ఆమె బందువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏకకాలంలో ఆరు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు.

Sub Registrar Taslima: అరెస్టైన నెలరోజులకు తస్లీమా ఇళ్లలో సోదాలు.. ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా?
Sub Registrar Taslima
Follow us on

మార్చి నెలలో ఓ ప్లాట్​ రిజిస్ట్రేషన్​ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్​ సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదైంది. తస్లీమా ఇంటితో పాటు ఆమె బందువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏకకాలంలో ఆరు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు.

మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న తస్లీమా మార్చి 22న ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అమెను అరెస్ట్ చేసి జైలు పంపింది అవినీతి నిరోధక శాఖ. అయితే, సరిగ్గా నెల రోజుల తరవాత ఆమె ఆస్తులపై విచారణ చేపట్టారు నిర్వహించారు. తస్లీమా ఇంటితోపాటు ఆమె బంధువుల ఇళ్ళల్లోనూ సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు డీఎస్పీ పి.సాంబయ్య నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ కాకతీయ కాలనీలోని తస్లీమాతో ఇంటితో పాటు ఆమె సోదరుల పేరుతో ఉన్న ఐదు ఇళ్ళు, సూర్యాపేటలోని ఆమె భర్త, భూపాలపల్లిలోని ఓ డాక్యుమెంట్​ రైటర్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మొత్తం ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు అధికారులు. సబ్​ రిజిస్ట్రార్​ గా పని చేస్తున్న తస్లీమా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

తన కుటుంబ సభ్యుల పేరున ఇండ్లు, ల్యాండ్స్ కూడబెట్టినట్లు గుర్తించారు. తస్లీమా, ఆమె కుటుంబ సభ్యుల పేరున రూ.2 కోట్ల ఏడు లక్షల విలువైన ఐదు ఇండ్లు, రూ.12 లక్షల విలువైన ఆరు ఇండ్ల స్థలాలు, ములుగులో రూ.20.40 లక్షల విలువైన మూడెకరాల వ్యవసాయ భూమి, రూ.1.92 లక్షల నగదు, రూ.98,787 బ్యాంక్​ బ్యాలెన్స్​, ఒక కియా కారు, రెండు బుల్లెట్​ బైకులు ఉన్నట్లు తేల్చారు.

ఈ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటన్నింటి విలువ రూ.2.95 కోట్లు వరకు ఉంటుందని నిర్ధారించారు. ప్రస్తుతం తస్లీమా ఏసీబీ ట్రాప్​ కేసులో కరీంనగర్​ జైలులో ఉండగా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో విచారణ జరుపుతున్నామని, కోర్టు ఆదేశాల మేరకు ఆ తరువాతి చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య వివరించారు.

సరిగ్గా నెల రోజుల తరువాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. సామాజిక కార్యకర్తగా, సబ్ రిజిస్ట్రార్ గా ప్రత్యేక ముద్ర వేసుకున్న తస్లీమాపై అవినీతి ఆరోపణలు ఆసక్తికర చర్చగా మారాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…