Telangana: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం!
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణకు అక్టోబర్ 30కి వాయిదా వేసింది.

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణకు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. అయితే విచారణ తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల ఆస్తులు కొల్లగొట్టారని ఆరోపిస్తున్నారని.. తమకు వేయి కోట్లు ఇచ్చి ఆ లక్ష కోట్ల ఆస్తులన్నీ తీసుకోండి అన్నారు. మిగిలిన 99 వేల కోట్లతో ప్రజలకు చేస్తానన్న హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. హైదరాబాద్‌కు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే ఫార్ములా-ఈని తెస్తే అందులో ఏదో జరిగిపోయిందని దాన్ని రద్దు చేసి.. తన మీద కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.
ఇటీవలే తమిళనాడు సీఎం విజయ్ ఒక మోటార్ రేసింగ్ ఈవెంట్ కోసం లండన్ దాకా పోయారని.. పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేశాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అదే ప్రయత్నం తాము చేసి ఫార్ములా-ఈ తీసుకొస్తే.. తమ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు అపారమైన విశ్వాసం ఉందని.. అందుకే రెండోసారి కోర్టు విచారణకు హాజరయ్యానన్నారు కేటీఆర్. భవిష్యత్తులో ఎప్పుడు పిలిచినా మళ్లీ కోర్టు విచారణకు వస్తాను అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
