AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. డెలివరీ ఏజెంట్‌నంటూ వచ్చాడు.. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉందని తెలిసి..సీసీ ఫుటేజ్‌ వైరల్‌!

ముంబై నగరంలో నివాస ప్రాంతాల భద్రతపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాందివాలి వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలే లక్ష్యంగా దుండగుడు తెగించిన ఘటన కలకలం సృష్టించింది. ఇళ్లలో ఉండే సీసీటీవీ కెమెరాల్లో ఈ దారుణ దృశ్యం రికార్డవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలేం జరిగింది..

దారుణం..  డెలివరీ ఏజెంట్‌నంటూ వచ్చాడు.. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉందని తెలిసి..సీసీ ఫుటేజ్‌ వైరల్‌!
Kandivali West Robbery
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2026 | 3:22 PM

Share

ముంబైలోని కాందివాలి ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న షాకింగ్ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి డెలివరీ ఏజెంట్ లేదా సందర్శకుడి ముసుగులో రెండవ అంతస్తులోని ఓ ఇంటికి వచ్చి, చిరునామా అడుగుతున్నట్లు నటించాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఈ మొత్తం దుశ్చర్య అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అపార్ట్‌మెంట్ల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నవంబర్ 3వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక నిందితుడు డెలివరీ బాయ్ లేదా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిలా నటిస్తూ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో రెండవ అంతస్తులో ఉన్న ఒక వృద్ధురాలు తన ఫ్లాట్ తలుపు తెరుస్తుండగా ఆమె దగ్గరికి వెళ్లాడు. తనకు ఒక ప్రత్యేక చిరునామా కావాలని అడిగాడు. ఆ వృద్ధురాలు మూడవ అంతస్తుకు వెళ్లమని దారి చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఆ వ్యక్తి వెళ్లేలా నటించి, అకస్మాత్తుగా వెనక్కి తిరిగి వృద్ధురాలపై దాడి చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా క్షణాల వ్యవధిలో ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఊహించని పరిణామానికి వృద్ధురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హౌసింగ్ సొసైటీలలో సెక్యూరిటీ ఏర్పాట్ల తీరుతెన్నులపై తీవ్ర చర్చ జరుగుతోంది. బయటి వ్యక్తులు ఎటువంటి తనిఖీలు లేకుండా అపార్ట్‌మెంట్‌లలోకి ఎలా ప్రవేశిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాందివాలి పోలీసులు వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను పరిశీలిస్తున్న పోలీసులు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నగరంలో వృద్ధులు, మహిళల భద్రతను నిర్ధారించడానికి పోలీసులు గస్తీని మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి ప్రాణ స్నేహితుడు నటించిన చివరి సినిమా.. రిలీజ్ డేట్ ఇదే
చిరంజీవి ప్రాణ స్నేహితుడు నటించిన చివరి సినిమా.. రిలీజ్ డేట్ ఇదే
డెలివరీ ఏజెంట్‌నంటూ వచ్చాడు.. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉందని
డెలివరీ ఏజెంట్‌నంటూ వచ్చాడు.. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉందని
ఒకరు 22.. మరొకరు 10.. పాక్‌పై చేతులెత్తేసిన దిగ్గజాల వారసులు
ఒకరు 22.. మరొకరు 10.. పాక్‌పై చేతులెత్తేసిన దిగ్గజాల వారసులు
దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా, అశుభమా? ఏమౌతుందంటే..
దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా, అశుభమా? ఏమౌతుందంటే..
వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
రజత్ పటీదార్ ఔట్.. రింకూ సింగ్‌కు ప్రమోషన్
రజత్ పటీదార్ ఔట్.. రింకూ సింగ్‌కు ప్రమోషన్
దీపావళి రోజు రాత్రి ఎన్ని దీపాలు వెలిగించాలి?పూజకు సరైన సమయం ఇదే!
దీపావళి రోజు రాత్రి ఎన్ని దీపాలు వెలిగించాలి?పూజకు సరైన సమయం ఇదే!
సగం కోసిన నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
సగం కోసిన నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
మనవరాలి కోసం 90 ఏళ్ల బామ్మ ఆరాటం.. అండగా నిలిచిన సోనూసూద్..వీడియో
మనవరాలి కోసం 90 ఏళ్ల బామ్మ ఆరాటం.. అండగా నిలిచిన సోనూసూద్..వీడియో