Hyderabad: ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు అరెస్ట్‌.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ మహేశ్ భగవత్..

|

Jul 12, 2022 | 9:36 AM

Hyderabad: మహిళను బెదిరించి అత్యాచారం చేసిన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

Hyderabad: ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు అరెస్ట్‌.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ మహేశ్ భగవత్..
Cp Mahesh Bhagawat
Follow us on

Hyderabad: మహిళను బెదిరించి అత్యాచారం చేసిన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నాగేశ్వర్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించిన సీపీ.. వివాహితను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడని తెలిపారు. నాగేశ్వరరావు బాధిత వివాహిత ఇంట్లోకి చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించారు. వివాహితపై రేప్, కిడ్నాప్, అక్రమ చొరబాటు, సర్వీస్‌ రివాల్వర్‌తో బెదిరింపులు సహా పలు‌ సెక్షన్ల కింద నాగేశ్వరరావుపై కేసులు నమోదు చేశామని సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. వివాహిత ఫిర్యాదు మేరకు నాగేశ్వర్‌రావును నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు అరెస్ట్‌కు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు రాచకొండ కమిషనరేట్ అధికారులు. దీని ప్రకారం.. ‘‘వివాహితపై తుపాకీతో అత్యాచారం, అపహరణ, నేరపూరిత నేరాలకు సంబంధించి వెస్ట్ మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ మాజీ ఎస్‌హెచ్‌ఓ కె. నాగేశ్వర్‌రావుపై ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. నెం: 875/2022 U/s 452, 376(2), 307, 448, 365 IPC, ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 30 నమోదు చేయడం జరిగింది. వనస్థలిపురం ఏసీపీ ఈ కేసు దర్యాప్తు చేయనున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రాచకొండ లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌తో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు విచారణలో ఉండగా, పక్కా సమాచారంతో పోలీసులు నిందితుడిని 10-07-2022న అర్థరాత్రి పట్టుకుని, 11-07-2022న జుడీషియల్ మెజిస్ట్రేట్ ద్వారా (15) రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపి, చర్లపల్లి జైలులో ఉంచారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది.’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..