Viral News: ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా ఎందరో ఆకలి తీర్చిన ఓ యువకుడు.. మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మనిచ్చాడు!

| Edited By: Ravi Kiran

Mar 19, 2024 | 1:42 PM

మరణం చివరి చరణం కానేకాదు అన్న మాటను నిజం చేశాడో ఓ యువకుడు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మినిచ్చన చిరంజీవిగా నిలిచాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ళ బిశ్వాల్ ప్రభాస్‌ డిగ్రీ స్టూడెంట్‌. పార్ట్‌టైమ్‌గా ఫుడ్‌ డెలవరీ బాయ్‌గా పనిచేసేవాడు.

Viral News: ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా ఎందరో ఆకలి తీర్చిన ఓ యువకుడు.. మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మనిచ్చాడు!
Food Delivery
Follow us on

మరణం చివరి చరణం కానేకాదు అన్న మాటను నిజం చేశాడో ఓ యువకుడు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మినిచ్చన చిరంజీవిగా నిలిచాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ళ బిశ్వాల్ ప్రభాస్‌ డిగ్రీ స్టూడెంట్‌. పార్ట్‌టైమ్‌గా ఫుడ్‌ డెలవరీ బాయ్‌గా పనిచేసేవాడు. కుటుంబానికి అండగా నిలిచిన బిశ్వాల్‌ ఈ నెల 14 యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి..అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు డాక్టర్లు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది.

బ్రెయిన్‌డెడ్‌గా నిర్దారించారు డాక్టర్లు. అదే టైమ్‌లో అవయవదానం గురించి బిశ్వాల్‌ ప్రభాస్‌ పేరెంట్స్‌కు వివరించారు. కొనవూపిరితో వున్న చెట్టంత కొడుకు చూసి తల్లడిల్లారు బిశ్వాళ్‌ తల్లిదండ్రులు. భౌతికంగా దూరమైనా అవయవదానంతో తమ బిడ్డ తమ కళ్లెదుటే ఉంటాడని భావించారు. పెద్దమనసుతో తమ బిశ్వాల్‌ ప్రభాస్‌ అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు.

వారి ఆమోదంతో బిశ్వాల్‌ ప్రభాస్‌ అవయవాలతో మరో ఇద్దరికి పునర్జన్మ లభించినట్టయింది. కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌ సెంథిల్‌కుమార్‌ అండ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఇద్దరు వ్యక్తులకు కాలేయ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కొడుకు మరణించాడన్న గుండెకోతను అధిగమించి పెద్దమనసుతో అవయవదానానికి అంగీకరించిన బిశ్వాల్‌ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్లు ప్రతీ ఒక్కరూ చిరంజీవి బిశ్వాల్‌ ప్రభాస్‌ తల్లిదండ్రులకు సెల్యూట్‌ చేశారు.