Warangal: ఓరుగల్లులో అద్భుతంగా తెప్పోత్సవం.. భద్రకాళీ చెరువులో హంస వాహనంపై అమ్మవారి విహారం

|

Oct 15, 2021 | 8:36 PM

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఓరుగల్లులోని భద్రకాళీ చెరువులో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు. హంస వాహనంపై అమ్మవారి విహారం కనులపండువగా సాగింది.

Warangal: ఓరుగల్లులో అద్భుతంగా తెప్పోత్సవం.. భద్రకాళీ చెరువులో హంస వాహనంపై అమ్మవారి విహారం
Warangal Dasara Teppotsavam
Follow us on

Warangal Dasara Festival: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఓరుగల్లులోని భద్రకాళీ చెరువులో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు. హంస వాహనంపై అమ్మవారి విహారం కనులపండువగా సాగింది. భద్రకాళీ చెరువులో తెప్పోత్సవానికి హాజరయ్యారు మంత్రి ఎర్రబెల్లి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు రాత్రి భద్రకాళీ- భద్రేశ్వరుల కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

వరంగల్‌లోని ఉర్సు రంగలీల మైదానంలో దసరా ఉత్సవాలు, రావణవధ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దాదాపు 70 అడుగుల ఎత్తుతో పది తలల రావణాసురుని ప్రతిమ ఏర్పాటు చేశారు. రంగురంగుల తారాజువ్వలతో ఏర్పాటు చేసినమల్లె పందిరి, నాగసర్పం ఆకట్టుకుంది.

మిరుమిట్లు గొలిపే కాతులు వెదజల్లాయి. అటు ఉర్సుగుట్ట భట్టుపల్లి క్రాస్‌రోడ్‌ సెంటర్లో పాల పిట్ట కూడలిని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. రావణ వధ సందర్భంగా కేరింతలు కొడుతూ ఏంజాయ్‌ చేశారు యువత. అటు, తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాలో పలుచోట్ల బతుకమ్మ ఉత్సావాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి సరదాగా కోలాటం, బతుకమ్మ ఆడిన సంగతి తెలిసిందే. వరంగల్ ఉర్సు గుట్ట రంగలీలా మైదానంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి ఎర్రబెల్లి.

 

Read also: RK: ఆక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్‌కె మరణంతో AOBలో మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ.?