Telangana: భర్తను చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

|

Sep 28, 2022 | 10:49 AM

ఇంటి పక్కన ఉన్న యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. భర్త రోజూ పనికి వెళ్లాక ఇద్దరూ తరచూ కలుస్తుండేవారు. ఒక రోజు వీరి విషయం అతనికి తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా వారిలో మార్పు రాలేదు...

Telangana: భర్తను చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
Crime News
Follow us on

ఇంటి పక్కన ఉన్న యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. భర్త రోజూ పనికి వెళ్లాక ఇద్దరూ తరచూ కలుస్తుండేవారు. ఒక రోజు వీరి విషయం అతనికి తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా వారిలో మార్పు రాలేదు. అంతే కాకుండా తమకు అడ్డుగా ఉన్న అతనిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. మద్యం మత్తులో ఉన్న అతని మొడకు చున్నీ బిగించి దారుణంగా చంపేశారు. తర్వాత మృతదేహాన్ని రైల్వే పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా హన్మంతపూర్‌ కు చెందిన కొమురెళ్లి.. మూడేళ్లుగా హైదరాబాద్ లోని సీతాఫల్‌మండిలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. జీహెచ్‌ఎంసీలో కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ క్రమంలో కొమురెళ్లి భార్య భారతికి.. జనగామ జిల్లా అడవికేశాపురానికి చెందిన ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ప్రవీణ్ వీరి ఇంటికి సమీపంలోనే ఉండేవాడు. కొమురెళ్లి పనికి వెళ్లిన సమయంలో అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చి, వెళ్తుండేవాడు. ఇటీవల భారతి, ప్రవీణ్‌ సన్నిహితంగా ఉండటాన్ని కొమురెల్లి గమనించాడు. పద్ధతి మార్చుకోవాలని మందలించాడు. దీంతో భర్తపై కక్షపై పెంచుకున్న భారతి.. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని నిర్ణయించింది. అదే రోజు రాత్రి ప్రవీణ్ సహాయంతో మద్యం మత్తులో ఉన్న కొమురెల్లి గొంతుకు చున్నీ బిగించి దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని అతని ద్విచక్రవాహనంపైనే ఇద్దరు కలిసి భువనగిరి వైపు తీసుకెళ్లారు. భువనగిరి మండలం అనంతారం గ్రామ శివారులోని రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై నుంచి ద్విచక్రవాహనాన్ని, మృతదేహాన్ని కిందకు పడేసి వెళ్లిపోయారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు సమాచారం అందుకున్నారు. మృతదేహం ఉన్న స్థలానికి వెళ్లారు. మృతుని సెల్‌ఫోన్‌ ఆధారంగా కొమురెల్లి తల్లికి సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం వద్ద మృతదేహం ఉన్న తీరు సందేహాస్పదంగా ఉండటానికి తోడు కొమురెళ్లి సోదరుడు వదినపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు భారతిని విచారించగా తాము చేసిన దారుణాన్ని వివరించి నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు భారతి, ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..