Telangana News: వీడో వెరైటీ దొంగ.. దొంగిలించిన బంగారాన్ని ఏం చేస్తుడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
మహబూబాబాద్ జిల్లాలో ఓ వెరైటీ దొంగ చేసిన పని అందరిన్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో నష్టపోయి దొంగగా మారాడు. తను దొంగిలించిన బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఇంతకి పోలీసులకు ఎలా చిక్కాడు? దొంగిలించిన బంగారాన్ని బ్యాంకులో ఎందుకు తాకట్టు పెట్టాడు? చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..!
మహబూబాబాద్ జిల్లాలో ఒకవైపు వరస దొంగతనాలు.. ఇంకోవైపు చైన్ స్నాచింగ్‌లు చేసిన అంతర్ జిల్లా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి రూ.14.63 లక్షల విలువైన 20.9 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తెలివైన దొంగ తాను దొంగిలించిన బంగారు ఆభరణాలను గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు జమా చేసుకోవడం అతనికి ఉన్నా ఓ అలవాటు..
బయ్యారం మండల కేంద్రానికి చెందిన అంగోత్ విక్రమ్ డ్రిల్లింగ్ మిషన్ టెక్నీషియన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. డబ్బులు ఎలా సంపాదించాలో యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ సీన్‌లను చాలాసార్లు చూసి… తను కూడా అలాగే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోయేవాడు.. అంతేకాదు తాళంవేసి ఉన్న ఇళ్లలో చేసిన కొన్ని చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలు కూడా రికార్డు అయ్యాయి. మొత్తం 11 చోరీలు చేసినట్లు మహబూబాబాద్ SP సుదీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. దొంగిలించిన బంగారు ఆభరణాలలో కొన్ని గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టాడు. మిగిలిన కొన్ని అమ్మేందుకు మహబూబాబాద్ పట్టణానికి వస్తుండగా పోలీసులు అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు. ఈ డిఫరెంట్ దొంగను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందించి, అభినందించారు.