మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో గురువారం గోమాతకు సీమంతం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యులు ప్రసాద్, మాధవి దంపతులు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ మధ్యనే ఒక ఆవును కొనుగోలు చేశారు. దీంతో అప్పటినుండి వారు ఇబ్బందులు తొలగిపోయాయని చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆవు ఐదు నెలల గర్భవతి కావడంతో, మనుషుల మాదిరిగానే ఆవును కూడా చూసుకోవాలనే సంకల్పంతో ఆవుకు సీమంతం నిర్వహించారు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రసాద్, మాధవి దంపతులు గర్భవతి అయిన ఆవుకు పలు రకాల నైవేద్యాలు సమర్పించారు. గోమాతలను రక్షించి భూమిని కాపాడుకోవాలని సంకల్పంతో ఆవుల రక్షణ కోసం కృషి చేస్తున్నామని మాధవి, ప్రసాద్ దంపతులు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో గోవును హిందువులు దైవంగా భావిస్తారు. కొందరు తమ ఇంటి బిడ్డలు గానూ భావిస్తారు. అలానే వీళ్ళు కూడ గోమాతను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఇలా శ్రీమంతం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి