లిప్టు రిపేర్ కొసం వచ్చి.. దాని కింద నలిగిపోయాడు.. 3 గంటలపాటు మృత్యువుతో పోరాటం..!

ఓ వ్యక్తి లిప్టు మరమ్మత్తుల కోసం వచ్చి వ్యక్తి.. ఆ లిఫ్ట్ కింద చిక్కుకుని మూడు గంటల పాటు మృత్యుతో పోరాటం చేశాడు.. చివరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడిన అతడు ఎట్టకేలకు మృత్యుంజయుడయ్యాడు. ఈ ప్రమాదం వరంగల్ నగరంలో చోటు చేసుకుంది.

లిప్టు రిపేర్ కొసం వచ్చి.. దాని కింద నలిగిపోయాడు.. 3 గంటలపాటు మృత్యువుతో పోరాటం..!
Man Strucked In Lift

Edited By: Balaraju Goud

Updated on: Feb 21, 2025 | 6:26 PM

ఓ వ్యక్తి లిప్టు మరమ్మత్తుల కోసం వచ్చి వ్యక్తి.. ఆ లిఫ్ట్ కింద చిక్కుకుని మూడు గంటల పాటు మృత్యుతో పోరాటం చేశాడు.. చివరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడిన అతడు ఎట్టకేలకు మృత్యుంజయుడయ్యాడు. ఈ ప్రమాదం వరంగల్ నగరంలోని గ్రాండ్ గాయత్రి హోటల్‌లో జరిగింది.

హైదరాబాద్‌కు చెందిన అంజి అనే మెకానిక్ అతనితోపాటు మరొకరు లిఫ్ట్ రిపేర్ కోసం వరంగల్‌కు వచ్చారు. గ్రాండ్ గాయత్రి హోటల్‌లో మరమ్మత్తులు జరుగుతున్న సందర్భంలో లిఫ్ట్ కింద పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ భాగంలో అంజి లిఫ్ట్ కింద ఇరుక్కున్నాడు. అర్తనాదాలు, అరుపులు పెడుతున్న అతన్ని హోటల్ సిబ్బంది గమనించారు. లిఫ్ట్ పైకి లేపి ప్రయత్నం చేశారు. కానీ ఓపెన్ కాలేదు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి అతన్ని బయటకు తీశారు. డ్రిల్లింగ్ మిషన్ తో లిఫ్ట్ పక్కన కట్ చేసి అతన్ని బయటకు తీశారు. మూడు గంటల పాటు లిఫ్ట్ కింద ఇరుక్కున్న అంజి మృత్యుంజయుడు అయ్యాడు.

వీడియో చూడండి.. 

హెవీ వెయిట్ లిఫ్ట్ అతని మీద పడడం వల్ల అతని నడుము విరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాపాస్థితిలో చికిత్స పొందుతున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ఆవరణలో లిఫ్ట్ నిర్మాణం చేపట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సెల్లార్ లో ఉన్న లిఫ్ట్ మూసివేయడంతో అతన్ని బయటకు తీయడం కష్ట తరంగా మారిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..