Telangana: ఓ వ్యక్తి ప్రాణం తీసిన మూత్ర విసర్జన.. ఉన్నచోటే కుప్పకూలి మృతి!

ఎక్కడ పడితే అక్కడ మూత్ర విస‌ర్జన చేస్తున్నారా..? అయితే బీకేర్‌ఫుల్..! అజాగ్రత్త ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మూత్ర విసర్జన చేస్తూ మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వ‌ర్షా కాలంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వ‌ద్ద మూత్ర విస‌ర్జన చేస్తే, ప్రాణాల మీదికి కొని తెచ్చుకున్నట్టే.. ! ఓ వ్యక్తి విద్యుత్ షాక్ త‌గిలే ప్రమాదానికి గురయ్యాడు.

Telangana: ఓ వ్యక్తి ప్రాణం తీసిన మూత్ర విసర్జన.. ఉన్నచోటే కుప్పకూలి మృతి!
Man Dies After Urination

Updated on: Aug 20, 2025 | 1:00 PM

ఎక్కడ పడితే అక్కడ మూత్ర విస‌ర్జన చేస్తున్నారా..? అయితే బీకేర్‌ఫుల్..! అజాగ్రత్త ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మూత్ర విసర్జన చేస్తూ మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వ‌ర్షా కాలంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వ‌ద్ద మూత్ర విస‌ర్జన చేస్తే, ప్రాణాల మీదికి కొని తెచ్చుకున్న‌ట్టే.. ! ట్రాన్స్‌ఫార్మ వద్ద ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తుండగా.. విద్యుత్ షాక్ త‌గిలే ప్రమాదానికి గురయ్యాడు. అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం స‌ృష్టించింది.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భ‌వ‌న్ సమీపంలో ఉన్న ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వర్షం పడటంతో తడిగా మారిపోయింది. అయితే ఆ ట్రాన్స్‌ఫార్మర్ వ‌ద్ద ఓ యువకుడు మూత్ర విస‌ర్జన చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా అతనికి విద్యుత్ షాక్ త‌గిలి అక్కడిక‌క్కడే కుప్పకూలిపోయాడు. అప్రమ‌త్తమైన స్థానికులు.. విధ్యుత్ సరఫరాను నిలిపివేసి, అతన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. సంఘ‌ట‌నాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని పట్టణానికి చెందిన దంతాల చక్రాధర్ (50) గా గుర్తించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటను సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కరెంటు తీగలు మృత్యుపాశాలు అయ్యాయి.. హైదరాబాద్‌లో వరుస విద్యుత్‌ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.. వరుస విద్యుత్ షాక్ మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక విషాద ఘటనను మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా విద్యుత్తు తీగలను తలచుకుంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అన్నిచోట్లా కరెంటు తీగలే కాటేయడం గమనార్హం. హైదరాబాద్‌ రామంతపూర్‌లో జరిగిన ఘటనలో ఐదుగురు, బండ్లగూడలో జరిగిన ప్రమాదంతో ఇద్దరు, బాగ్‌అంబర్‌పేటలో ఒకరు, సిద్దిపేట జిల్లాలో మరో ఇద్దరు, కామారెడ్డి జిల్లాలో ఒకరు.. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే 11మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా విద్యుత్తు షాక్‌లతో ఏటా 300 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

వరుస ప్రమాదాలతో విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో విద్యుత్, కేబుల్ వైర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. నగరంలో వేలాడుతున్న వైర్లు, ప్రమాదకర స్థితిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను తనిఖీ చేస్తున్నారు. వేలాడుతున్న ఓపెన్ స్విచ్‌లను తొలగిస్తున్నారు. వరుస ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఇటు ప్రభుత్వం నుంచి విద్యుత్‌ శాఖకు కాస్త స్ట్రిక్ట్‌గానే ఆదేశాలందాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..