Telangana: పండగ పూట విషాదం.. గొంతులో మటన్‌ ముక్క ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి.. చివరకు..

|

Apr 14, 2022 | 5:40 PM

చికెన్, మటన్, ఫిష్.. ఇలా నాన్ వెజ్ వంటకాల పేర్లు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇక మాంసం వంటకాలు రెడీ అవ్వగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా లొట్టలేసుకుని తింటుంటారు.

Telangana: పండగ పూట విషాదం.. గొంతులో మటన్‌ ముక్క ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి.. చివరకు..
Mutton Curry
Follow us on

చికెన్, మటన్, ఫిష్.. ఇలా నాన్ వెజ్ వంటకాల పేర్లు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇక మాంసం వంటకాలు రెడీ అవ్వగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా లొట్టలేసుకుని తింటుంటారు. అయితే మాంసం తినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలే పోతాయని ఇటీవల చాలా ఘటనలు నిరూపిపంచాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన సంఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని రాజానాయక్​తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూక్య గోపి కుటుంబం ముత్యాలమ్మను ఇంటి దైవంగా కొలుస్తారు. ఈనేపథ్యంలో తాజాగా ముత్యాలమ్మకు ఘనంగా జాతర చేశారు. మేకను బలిచ్చి రుచికరంగా వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆతర్వాత బంధువులతో కలిసి ఇంటిల్లిపాది కూర్చుని సంతోషంగా సహ పంక్తి భోజనాలు చేశారు.

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి..

కాగా ఇదే సమయంలో భూక్య గోపి గొంతులో మాంసం బొక్క(ఎముక) ఇరుక్కుపోయింది. అది లోపలికి వెళ్లక.. బయటికి రాకపోవడంతో గోపి నరకం చూశాడు. కుటుంబ సభ్యులు, బంధువులు మాంసం ముక్కను బయటకు తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఏదీ ఫలితమివ్వలేదు. మరోవైపు ఊపిరాడక గోపి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ డాక్టర్లు కూడా శాయశక్తులా ప్రయత్నించినా ఎముకను బయటకు తీయలేకపోయారు. దీంతో ఊపిరాడలేక గోపి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అంతవరకు ఉత్సాహంగా పండగ చేసుకున్న కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా బుధవారం భూక్యా గోపికి అంత్యక్రియలు నిర్వహించిన పెద్దకుమారుడు సురేష్.. కార్యక్రమం అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: EIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

CARI Bengaluru Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. సెంట్రల్‌ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..

K.G.F Chapter 2: సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ మేకర్స్.. చాప్టర్ 2 ఎండింగ్‌లో ఊహించని ట్విస్ట్