కళ్ల ముందే ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిన యువకుడు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో

హన్మకొండ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశోక జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు డీకొట్టింది. కింద పడిన హరికృష్ణ, బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ హరికృష్ణ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కళ్ల ముందే ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిన యువకుడు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో
Man Dies Hit By Rtc Bus

Edited By:

Updated on: Feb 21, 2026 | 7:57 PM

హన్మకొండ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశోక జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు డీకొట్టింది. కింద పడిన హరికృష్ణ, బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ హరికృష్ణ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఫిబ్రవరి 19, గురువారం రోజున హన్మకొండ అశోక్ జంక్షన్ వద్ద హరికృష్ణ అనే యువకడు సాధారణంగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ వ్యక్తి నేరుగా బస్సు చక్రాల కిందకు వెళ్లిపోయాడు. ఈ మొత్తం ఉదంతం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us