Telangana: కలుషిత నీరు తాగి బాలిక మృతి.. ఆస్పత్రి పాలైన మరో 9మంది.. ఆందోళనలో గ్రామస్తులు..

|

Feb 22, 2023 | 4:59 AM

Narayanpet: నారాయణ్ పేట్ జిల్లాలో తీవ్ర అస్వస్థతకు గురై ఓ బాలిక చనిపోయింది. అదే కాలనీలో మరో 9 మంది కూడా ఆస్పత్రి పాలు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telangana: కలుషిత నీరు తాగి బాలిక మృతి.. ఆస్పత్రి పాలైన మరో 9మంది.. ఆందోళనలో గ్రామస్తులు..
Died
Follow us on

Telangana: నారాయణ్ పేట్ జిల్లా మద్దూరు మండలం మోమిన్ పూర్ గ్రామంలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై ఒక బాలిక మృతి చెందింది. మరో తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. నిన్న రాత్రి అనిత అనే బాలిక పదకొండు గంటల సమయంలో అస్వస్తతకు గురైంది. వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో.. ఆమెను హుటాహుటిన నారాయణ్ పేట్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరో తొమ్మిది మంది కూడా అస్వస్తకు గురవడంతో కొందర్ని మద్దూరు ఆస్పత్రికి మరికొందర్ని మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి వైద్య సేవల కోసం తరలించారు. అనిత అనే ఈ బాలిక చనిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఒకే కాలనీకి చెందిన వారు కూడా అస్వస్థతకు గురి కావడంతో.. ఇక్కడున్న బోరు నీరు కలుషితమైనట్టు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

ఈరోజు ఉదయం అనిత అనే అమ్మాయి మృతి చెందడంతో గ్రామస్తులు అందరూ ఆందోళనకు గురయ్యారు ఒకే కాలనీ చెందిన వారు అస్వస్తత కు గురి కావడం తో అక్కడ వున్న బోరు పంపు నీరు కలుషితం కావడం ఈ సంఘటన జరిగినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీనితో గ్రామం లో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వ హిస్తున్నారు.

వచ్చే 48 గంటల్లో నివేదిక వచ్చాక గానీ అసలు విషయం తెలీదని అంటున్నారు అధికారులు. ఇప్పికైతే అందరూ ఇక్కడ నీటి కాలుష్యం వల్లే.. బాలిక మృతి చెందిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..