ఐక్యా అంటే ఫర్నీచర్ అమ్మకాలకు బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచవ్యాప్తంగా ఐక్యా ఫర్నీచర్‌కు యామ డిమాండ్ ఉంది. దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున స్టోర్స్ ఉన్నాయి. అయితే ఐక్యా ఫర్నీచర్ కొనుగోలు చేస్తే, వాళ్ళ సొంత వాహనాల్లో హోమ్ డెలివరీ చేస్తుంటారు. ఇదే అదునుగా ఓ ముఠా పెద్ద స్కెచ్ వేసింది. విషయం బయటకు పొక్కడంతో ఎక్సైజ్ పోలీసులు మాటు వేసి కాటు వేశారు..!
వెళ్లేటప్పుడు ఫర్నీచర్ లోడుతో వెళ్లి, డెలివరీ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా ఎందుకు రావాలి అన్న ఆలోచన డ్రైవర్లకు తట్టింది. అది ఇది తెస్తే ఏం లాభం అనుకున్నారో ఏమో..? ఏకంగా గంజాయి తీసుకొస్తే ఐక్యా చుట్టూ ఉన్న ఐటీ కంపెనీ ఎంప్లాయిలకు సప్లై చేయొచ్చని భావించారు. డబ్బులు కూడా దండిగా వస్తాయి కదా అని ఆలోచన ఐక్య డ్రైవర్లకు తట్టింది. అనుకున్నదే తడువుగా ఫర్నీచర్ డెలివరీ వ్యాన్‌లో ఐటీ ఎంప్లాయిలకు గంజాయి సప్లై చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్ ఐక్యా కంపెనీలో కొనుగోలు చేసిన పర్నీచర్ ఐటమ్‌ను వ్యాన్లలో సరపరా చేసి వస్తూ, తిరుగు ప్రయాణంలో గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతోంది ఓ ముఠా. గచ్చిబౌలి ప్రాంతంలో పనిచేసే ఐటీ ఉద్యోగులతో ఉన్న సత్సంబంధాలు పెట్టుకొని వారికి గంజాయి సరపరా చేస్తున్నారు. అదనపు ఆదాయం సంపాందించడానికి ప్రయత్నాలు చేస్తూ ఎక్సైజ్ ఎస్‌జీఎఫ్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు.
గచ్చిబౌలి ప్రాంతంలోని టెలికాంనగర్ జీహెచ్‌ఎంసీ పార్కు ప్రాంతంలో హెచ్‌డీఎఫ్ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హెచ్‌డీఎఫ్ సీఐ నాగరాజు సిబ్బంది కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఐక్యా సరుకులు రవాణ చేసే వ్యాన్‌లో తనిఖీలు నిర్వహించారు. దీంతో 1.12 కేజీల గంజాయి పట్టుబడింది. ఐక్యా వాహనాల డ్రైవర్లు గచ్చిబౌలి ప్రాంతంలోని ఉన్న వ్యక్తులకు గంజాయి తీసుక వచ్చి ఇస్తున్నట్లు గుర్తించారు. గంజాయి ముఠా కేటుగాళ్లు పర్నీచర్ రవాణ చేసే వ్యాన్ డ్రైవర్లను వినియోగించుకున్నట్లు పోలీసులు తేల్చారు.
గంజాయిని తీసుకువచ్చిన చితారి మహేష్, డి.సిద్దులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిది నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. గంజాయిని పట్టుకున్న ఎస్‌టీఎఫ్ ఎస్ఐ జ్యోతి బృందాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..