తెలంగాణ కొత్త గవర్నర్ .. ఫ్లాష్ బ్యాక్ !

|

Sep 03, 2019 | 6:30 PM

తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమితురాలైన తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ గతంలో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. 2018 లో ఈమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని మదురై లోని ట్యుటికోరన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. లూయిస్ సోఫియా అనే రీసెర్చ్ స్కాలర్ తండ్రి గత ఏడాది అక్టోబరులో సౌందరరాజన్ పైనా, బీజేపీపైనా ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ జరపాలని కోర్టు ఇఛ్చిన ఆదేశాలతో వారు కేసు పెట్టారు. అది గత ఏడాది […]

తెలంగాణ కొత్త గవర్నర్ .. ఫ్లాష్ బ్యాక్ !
Follow us on

తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమితురాలైన తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ గతంలో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. 2018 లో ఈమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని మదురై లోని ట్యుటికోరన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. లూయిస్ సోఫియా అనే రీసెర్చ్ స్కాలర్ తండ్రి గత ఏడాది అక్టోబరులో సౌందరరాజన్ పైనా, బీజేపీపైనా ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ జరపాలని కోర్టు ఇఛ్చిన ఆదేశాలతో వారు కేసు పెట్టారు. అది గత ఏడాది సెప్టెంబర్ 3. ఆ రోజున సౌందరరాజన్ చెన్నై-ట్యుటికోరన్ విమానమెక్కారు. అదే విమానంలో 28 ఏళ్ళ మ్యాథ్స్ రీసెర్చ్ స్కాలర్ సోఫియా కూడా తన తలిదండ్రులతో బాటు ప్రయాణించింది. ప్లేన్ లో ఏం జరిగిందో ఏమోగానీ..అది ట్యుటికోరన్ చేరగానే సోఫియా.. సౌందరరాజన్ పైనా, బీజేపీ పైనా నిరసనపూర్వక నినాదాలు చేస్తూ.. కమలం పార్టీని ఫాసిస్టు గా అభివర్ణించింది. దీంతో ఆమెపై సౌందరరాజన్ ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆ తరువాత బెయిలుపై విడుదల చేశారు.

అయితే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సోఫియాను తాను దూషించలేదని ఆ తరువాత సౌందరరాజన్ వివరణ ఇచ్చుకున్నారు. ఈమెకు, కెనడాలో రీసెర్చ్ చేస్తున్న సోఫియాకు మధ్య రేగిన వివాదం అప్పట్లో తమిళనాడులో కలకలం సృష్టించింది. కాగా-తన కూతురిని కులం పేరిట దూషించారని, ఆమెను వేధించాలని సౌందరరాజన్ బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని సోఫియా తండ్రి ఎ. ఎ. స్వామి గత ఏడాది సెప్టెంబరు ఆరున తమిళనాడు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కూతురిపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని కూడా ఆయన ఆరోపించారు. కొన్నాళ్ళకు ఆ వివాదం సద్దు మణిగింది.

అటు-2017 లో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ‘ మెర్సల్ ‘ మూవీలోని కొన్ని సీన్స్ ని తొలగించాలని సౌందరరాజన్ ఆ చిత్ర నిర్మాతలను డిమాండ్ చేయడం నాడు పతాక వార్తలకెక్కింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు బీజేపీ ప్రతిపాదనలైన జీఎస్టీ, డిజిటల్ ఇండియా వంటివాటిని కించపరిచేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఉద్దేశంతో విజయ్.. బీజేపీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కూడా ఆమె ఆ సందర్భంలో దుయ్యబట్టారు. ఇలా… సౌందరరాజన్ తమిళనాడులో దాదాపు ప్రతిరోజూ వార్తల్లో ఉంటూ వచ్చారు.